ప్రభాస్ సినిమా కారణంగా నా సినిమా ఎత్తిపోయింది... ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్!

నటిగా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ (Aishwary Rajesh) సాధారణ కథాంశాలతో కూడిన సినిమాలను కాకుండా విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

తెలుగులో ఈమె కొన్ని సినిమాలలో నటించినప్పటికీ తమిళంలో మాత్రం ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

తాజాగా ఐశ్వర్య రాజేష్ నటించిన ఫర్హానా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె చిత్ర పరిశ్రమ గురించి తన కెరీర్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.

My Movie Got Canceled Because Of Prabhas Movie Aishwarya Rajeshs Shocking Comm

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఐశ్వర్య రాజేష్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సాహో(Saaho) సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను నటించిన కౌశల్య కృష్ణమూర్తి( Kousalya Krishnamurthy) సినిమా కోసం తాను ఎంతో కష్టపడటమే కాకుండా ఫిజికల్ గా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు.అయితే ఈ సినిమా తమిళంలో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

Advertisement
My Movie Got Canceled Because Of Prabhas' Movie Aishwarya Rajesh's Shocking Comm

తెలుగులో కూడా మంచి కలెక్షన్లు రాబడుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన వారానికే ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైందని తెలిపారు.

My Movie Got Canceled Because Of Prabhas Movie Aishwarya Rajeshs Shocking Comm

కౌసల్య కృష్ణమూర్తి సినిమాకు ఆడియోస్ పెరుగుతున్న క్రమంలో ప్రభాస్ సినిమా విడుదల కావడంతో ఆ ఎఫెక్ట్ తన సినిమా కలెక్షన్ల పై పడిందని ఇలా ప్రభాస్ సినిమా కారణంగా తన సినిమా ఎత్తిపోయిందనీ ఐశ్వర్య రాజేష్ తెలిపారు.ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదల అవుతున్నప్పుడు అతనితో మనమెందుకు పోటీ పడటం అని తాను నిర్మాతలకు చెప్పినప్పటికీ వినకుండ ఈ సినిమాని విడుదల చేశారని,ప్రభాస్ సినిమా ప్రభావం తన సినిమాపై చాలా చూపించింది ఆ సమయంలో తాను కాస్త బాధపడ్డానని ఐశ్వర్య రాజేష్ తెలియజేశారు.ఇక ఈ సినిమా టెలివిజన్లో ప్రసారమై మంచి రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా తన నటనపై ప్రశంసలు కురిపించడంతో చాలా సంతోషం వేసిందని ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు