అనుమతులు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని అనుమతి లేని గుర్తింపు లేని పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.

విద్య సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో అనుమతి లేని గుర్తింపు లేని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా కొన్ని పాఠశాల యాజమాన్యాలు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, కొన్ని పాఠశాలలకు అట స్థలాలు కూడా లేకుండా పాఠశాలలు నడిపిస్తున్నారన్నారు.అట్టి విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని,ప్రతి పాఠశాలలో నోటీసు బోర్డు లో ప్రతి తరగతి కి సంబంధిన ఫీజు వివరాలు తెలిపేలా వుండాలని విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి బంగారు బాటకు దారి చూపాలని కోరడం జరిగింది.

Action Should Be Taken Against School Without Permission , Kancharla Ravi Goud,

దీనికి వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారి కి చెప్పి అలాంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్,నాయకులు రుద్రవేని సుదీప్, కొడం వెంకటేష్, తిరుపతి,భాను, కోటి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

కస్టమర్‌లా వచ్చింది.. అందరి కళ్లుగప్పి చెప్పులు కొట్టేసింది.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే!
Advertisement

Latest Rajanna Sircilla News