దేవుడా: రికార్డు కోసం ఇలా కూడా చేస్తున్నారా..?! అసలు మ్యాటర్ ఏంటంటే..?!

చాలా మంది రికార్డు సాధించాలంటే శ్ర‌మిస్తారు.రాత్రనగా, పగలనగా క‌ష్ట‌ప‌డతారు.

ఎన్నో పుస్తకాలు చదువతారు.

ప‌ర్వ‌తాలు కూడా ఎక్కుతారు.

ఇలా అందరూ అనుకుంటూ ఉంటారు.అంత పెద్ద పెద్ద కష్టాలు పడి రికార్డులు నెలకొల్పుతారు.

ఇది మామూలుగా జరిగేపనే.అయితే ఇక్కడో యువకుడు అంత పెద్ద పెద్ద క‌ష్టాలు ఏవీ పడలేదు.

Advertisement
Karnataka Man Creates India's World Record Counts Korralu, Karnataka , Korralu

కేవలం ఇంట్లో హాయిగా కూర్చొని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.క‌ర్ణాట‌క‌కు చెందిన యువ‌కుడు ఇలా రికార్డు బద్దలు కొట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అతను రికార్డు నెలకొల్పడం వింతల్లోనే వింత అని అందరూ కామెంటు చేస్తున్నారు.మరి ఆ యువకుడు ఇంతకీ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో మీరు కూడా ఆ యువకుడు చేసిన ప్రయత్నాన్నే చేయొచ్చు.తృణ ధాన్యాలుగా పిలిచే కొర్ర‌లు అందరికీ తెలిసిందే.

అందరూ తమ తమ ఇళ్లల్లో నిత్యం వంట‌లలో కొర్రలను వినియోగిస్తుంటారు.ఆవాల సైజు క‌న్నా త‌క్కువ‌గానే కొర్రలు అనేవి ఉంటాయి.

Karnataka Man Creates Indias World Record Counts Korralu, Karnataka , Korralu
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

మనం తినేటటువంటి ఆ కొర్రలు ఒక కిలోకు ఎన్ని కొర్ర‌లు అంటే వాటి సంఖ్య‌ను అవి ఎన్ని అని అడిగితే ఎవ్వరూ కూడా ఏం చెప్పలేరు.ఈ ఐడియాతోనే క‌ర్ణాట‌క‌కు చెందిన అభిషేక్‌కు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.కర్ణాటకకు చెందిన అభిషేక్ మాత్రం 87 గంటలల్లో ఒక కిలో కొర్రలను లెక్కించి చూపించాడు.

Advertisement

అందుకే అతడు `ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్`లో చోటును సంపాధించాడు.న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇంట్లోనే కూర్చుని అభిషేక్ కొర్ర‌లు లెక్కించి చూపించాడు.

కిలోకు మొత్తం 4 లక్షల 4 వేల 882 కొర్రలు ఉంటాయ‌ని ఆయన లెక్క వేసి చూపించాడు.దీంతో ప్రఖ్యాత ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని కైవశం చేసుకున్నాడు.

ఈ ఘనత సాధించేందుకు మొత్తం 87 గంటల 35 నిమిషాలు ఆ వ్యక్తి కష్టపడ్డాడు.అభిషేక్ ప్రతి 500 కొర్రలను ఒక ప్యాకెట్గా చేశాడు.

ఇండియా వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం సమక్షంలోనే ఇలా లెక్కించడం వలన రికార్డు నెలకొల్పాడు.

తాజా వార్తలు