ఆధార్ సెంటర్ లేక ప్రజల అవస్థలు...!

నల్లగొండ జిల్లా:ఆధార్ కార్డు ఇప్పుడు దేశంలో అన్ని పనులకూ అక్కరకు వచ్చే గుర్తింపుగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అందుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.

మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ నమోదు సెంటర్ నల్లగొండ జిల్లా పెడ్డవూర మండల కేంద్రంలో గత ఏడాది నుండి మూతపడి ఉండడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేషన్ బియ్యం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉండి రేషన్ కార్డుకి ఆధార్ లింకు చేసుకొని ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో మండలంలోని పలు రేషన్ సెంటర్లలో వృద్ధులకు,చిన్నపిల్లలకు వేలిముద్రలు పడకపోవడంతో రేషన్ షాపు దారులు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

పెద్దవూర, హలియా,నాగార్జునసాగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆధార్ నిర్వాహకులపై ఆరోపణలు రావడంతో ఆధార్ కేంద్రాలను తొలగించారు.దీనితో ఆధార్ సెంటర్లు పనిచేయకపోవడంతో దూర ప్రాంతాలలో ఉన్నటువంటి నల్గొండ, మిర్యాలగూడ,మల్లేపల్లి ఆధార్ సెంటర్లకి వెళ్లాల్సి వస్తుందని,వెళ్లినా అక్కడ సీరియల్ రావాలంటే మూడు రోజుల సమయం పడుతుందని,గిరిజన ప్రాంతాలు కావడంతో కూలి పనులు మానుకొని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్లు పనిచేసేలా చూడాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.నా పేరు చల్ల సాంబయ్య పెద్దవూర మండలం, తుంగతుర్తి గ్రామం.

Advertisement

నాకు ఇద్దరు పిల్లలు,నేను రేషన్ కార్డు లింక్ కోసం రేషన్ షాప్ కు వెళ్లాను.అక్కడ పిల్లల వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్ అప్డేట్ చేసుకోమని సూచించారు.

దగ్గర్లో ఉన్న పెద్దవూర ఆధార్ సెంటర్ కి వెళ్తే మూతపడి ఉంది.నా వ్యవసాయ పనులు మరియు పిల్లల స్కూలు బంద్ చేసుకొని దూర ప్రాంతంలో ఉన్న పీఏపల్లి ఆధార్ సెంటర్ కి వెళ్ళాను.

అక్కడ ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉన్నా నా వంతు వచ్చేసరికి మూడు రోజులు పట్టింది.ఇప్పటికైనా పెద్దవూరలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని అంటున్నారు.

వీడియో వైరల్‌ : మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌
Advertisement

Latest Nalgonda News