బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా

నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సింగం సంతోష్ గతంలో వినాయక చవితి ఊరేగింపులో గొడవలు సృష్టించినందుకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.

సత్ప్రవర్తన కొరకు పోలీసులు తహశీల్దార్ ముందు లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేశారు.

తిరిగి నూతన సంవత్సర వేడుకల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గానూ సంతోష్ పై మళ్ళీ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.బైండోవర్ ను ఉల్లంఘించిన అతనిని తహశీల్దార్ ముందు హాజరపరచగా లక్ష రూపాయల జరిమానా విధించారు.

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తిప్పర్తి ఎస్ఐ తెలిపారు.

ఖాళీ క‌డుపుతో వీటిని తింటే చాలా డేంజ‌ర్‌..!
Advertisement

Latest Nalgonda News