సురక్ష దినోత్సవం రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం:ఎస్పీ రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట జిల్లా

: సురక్షా దినోత్సవం రోజున నిర్వహించే భారీ ర్యాలీనివిజయవంతం చేయాలనిసిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం( Telangana State Formation Day ) దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని జూన్ 4వ తేదీన జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సురక్ష దినోత్సవం ర్యాలీ నిర్వహణకు సంబంధించి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్,డీఎస్పీలు, సీఐలు,ఎస్ఐలు పోలీసు అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి,అనంతరం ర్యాలీ రూట్ మ్యాప్ ను సిబ్బందితో కలిసి పరిశీలించి,ర్యాలీ రిహార్సల్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీలో ( Rally )పాల్గొనే వాహనాలు ముందుగా వాహనాలు ఎస్వీ కళాశాల నుండి పిఎస్ఆర్ సెంటర్,ఖమ్మం క్రాస్ రోడ్ నుండి కొత్త బస్టాండ్ వరకు వస్తాయన్నారు.కొత్త బస్టాండ్ నుండి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు,పోలీసు సిబ్బంది ర్యాలీగా బయలుదేరి శంకర్ విలాస్ సెంటర్ మీదుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారని అన్నారు.

A Huge Rally Is Being Organized On The Day Of Suraksha Day SP Rajendra Prasad De

ర్యాలీలో ఉండే పోలీస్ వాహనాలు శంకర్ విలాస్ సెంటర్ నుండి రాఘవా ప్లాజా వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రక్కన గల మార్కెట్ స్థలానికి చేరుకుంటాయి అన్నారు.ర్యాలీ నందు తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిభింబించే విధంగా కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

సభ అనంతరం సామూహిక భోజనాలు ఉంటాయని,కార్యక్రమం నందు పౌరులు,ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.పోలీసు ప్రతిభ విజయాలకు సంబంధించి విషయాలు ఈ ర్యాలీ నందు వివరించడం జరుగుతుందన్నారు.

Advertisement

పెట్రో కార్,బ్లూ కోర్స్,డయల్ 100,పోలీసు సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనిటీ కార్యక్రమాలు, షీ టీమ్స్,భరోసా సెంటర్, పాస్పోర్ట్ వెరిఫికేషన్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు,పోలీసు ప్రజల సత్సంబంధాలు, స్నేహపూర్వక పోలింగ్, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం,కోర్టు మానిటరింగ్,పోలీసు పని విభాగాలు,పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ మొదలగు అంశాలపై పౌరులకు వివరించడం జరుగుతుందన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Suryapet News