జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు సువర్ణావకాశం.

సీసీటీవీ ఇన్స్టాలైజేషన్ (CCTV installation)లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై మూడు నెలల ఉచిత శిక్షణతో పాటుగా ఉపాధి అవకాశాలు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండవ దశ ఉచిత భోజనం, వసతితో కలిగిన మూడు నెలల పాటుగా సీసీటీవీ ఇన్స్టాలైజేషన్ లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై ఉచిత శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బుధవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు 10th సర్టిఫికేట్ తో సంబంధిత పోలీస్ స్టేషన్లో 12-12-2024 నుండి 15-12-2024 రోజు సాయంత్రంలోగా పెరు నమోదు చేసుకోవాలని తెలిపారు.

నిరుద్యోగ యువత ఈట్టి సువర్ణావకాశన్నీ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Advertisement

Latest Rajanna Sircilla News