మద్యం సేవించి పోలీసు అధికారులు విధులకు ఆటంకము కలిగించిన కేసులో వ్యక్తికి ఒక సంవత్సరం ఆరు నెలల జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు డిఎస్పీ మాట్లాడుతు….
తేది:- 02 ఫిబ్రవరి 2017 రోజున రాత్రి 8:00 గంటల ప్రాంతమున సిరిసిల్ల లో గల కార్గిల్ లేక్ వద్ద వున్న పెట్రోల్ బ్యాంకు వద్ద సిరిసిల్ల పోలీసు వారు వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న మమ్ములను తపించుకుని పోవుచుండగా ఆపినాము .అతనికి డ్రాంక్ అండ్ డ్రైవ్ మిషన్ తో చెక్ చేయగా మద్యం తగినట్లు వచ్చినాది .కాబట్టి అతని యొక్క వివరాలు రాయుచుండగా సదరు వ్యక్తి నేను కాన్సిలర్ ను నన్ను ఆపుతారా నేను అనుకుంటే మీ పోలీసులను న గేటుకు కావాలి పెట్టుకుంట అని అసభ్యకరంగా తిట్టినాడు .మీరు అమర్యాదగా మాట్లాడవద్దు అన్నందుకు అతను నా గల్లా పట్టిగుంజినాడు అని ట్రాఫిక్ కానిస్టేబుల్ బొంగొని నాగరాజు పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోలీసుల దురుసుగా ప్రవర్తించిన గుగులోత్ హనుమంతు నాయక్ తండ్రి :-గణ నాయక్ వయస్సు:-52 సంవత్సరాలు, కన్సిలర్ ,గణేష్ నగర్ సిరిసిల్లకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఎస్ ఐ లియకత్ అలీ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.విచారణ అనంతరం విచారణ అధికారి లియకథ్ అలీ ఎస్ ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్.ఐ.రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ , ఆరు(6) మంది సాక్షులను ప్రవేశపెట్టినారు.ప్రాసిక్యుశన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ నేరస్తుడు అయిన గుగులోతు హనుమంతు నాయక్ కు (1) సంవత్సరo 6 నెలల (18నెలల) కఠిన కారాగార జైలు శిక్ష తో పాటు ఏడు వెయ్యిల రూపాయల జరిమానా విదించడం జరిగింది అని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.