ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షల వెల్లువ

రాజన్న సిరిసిల్ల జిల్లా :కొత్త సంవత్సరం ను పురస్కరించుకుని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

గురువారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని స్టేట్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, జిల్లా అధికారులు కలెక్టరెట్ అధికారులు,సిబ్బంది పలువురు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పుష్ప గుచ్చాలు , మొక్కలు అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లతో సమావేశం నిర్వహించారు.జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా పరిపాలన గ్రామ, వార్డు సదస్సుల నిర్వహణ పై అధికారులతో చర్చించారు.

ప్రజా పాలన సదస్సుల దరఖాస్తు అందజేసేందుకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

Latest Rajanna Sircilla News