కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.ఈ క్రమంలో ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇప్పటికే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండగా.సాయంత్రం ఈటల కూడా హస్తినకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పార్టీ పరిస్థితులపై అధిష్టానంతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు.అయితే తెలంగాణ బీజేపీపై పార్టీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే అమిత్ షా, జేపీ నడ్డాలు పార్టీలోని తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు.అయితే గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు