Mudupu : ముడుపు అంటే ఏమిటో తెలుసా..? అసలు దేవుడికి ముడుపు ఎలా కట్టాలి..?

చాలామంది భగవంతునికి ముడుపు( Mudupu ) ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు.అయితే తమ కోరిక తీరిన తర్వాత ముడుపుతో దర్శనం చేసుకుని ముడుపు మొక్కులు చెల్లిస్తానని స్వామి వారికి వెళ్లాల్సిన మొక్కును ముడుపుగా కడతారు.

 What Is The Importance And Significance Of Mudupu-TeluguStop.com

అయితే ముడుపు అంటే ఏమిటి.? స్వామివారికి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి ముడుపు కడతారు.

మనుషులు తమ జీవితంలో ఓ ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి.

ఇలా ధర్మబద్ధంగా ఆచరించిన కార్యములు తినడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి.ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతం అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.ధర్మబద్ధమైన కోరికలు అంటే పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని,

Telugu Mudupu, Mudupu Pooja, Mudupu Process, God, Srivenkateswara-Latest News -

వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం జరగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు( Righteous Desires ) నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతం అని పండితులు సైతం చెబుతున్నారు.అయితే వెంకటేశ్వర స్వామికి( Venkateswara Swamy ) ముడుపు కట్టాలనుకుంటే శనివారం రోజున ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత నిత్య దీపారాధన చేయాలి.

Telugu Mudupu, Mudupu Pooja, Mudupu Process, God, Srivenkateswara-Latest News -

ఇక మీ కోరిక చెప్పుకొని స్వామివారికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి.ఇక కొత్తటి తెల్లటి వస్త్రం తీసుకొని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి.ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు పెడుతున్నారో మనస్పూర్తిగా, భక్తిగా స్వామి వారికి చెప్పుకోవాలి.ఇక డబ్బు పెట్టిన పసుపు బట్టని ముడుపులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి.

ఇక కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామి వారికి మాట ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube