దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నిమ్మపండ్లను విరి విరిగా వాడుతూనే ఉంటారు.అయితే నిమ్మరసం తీసుకుని తొక్కలను పారేయడం అందరికీ ఉన్న కామన్ అలవాటు.
కానీ నిమ్మ తొక్కల్లో( Lemon Peels ) ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ దాగి ఉన్నాయి.చర్మ సౌందర్యాన్ని పెంచడానికి నిమ్మ తొక్కలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.
పారేసే నిమ్మ తొక్కలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే ఖర్చు లేకుండా ఫేషియల్ గ్లో స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఫేషియల్ గ్లో పొందడానికి నిమ్మ తొక్కలను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా రెండు నిమ్మ పండ్లను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడగాలి.
ఆపై తొక్కను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మ పండు తొక్కలను వేసుకోవాలి.అలాగే అరకప్పు పచ్చిపాలు( Milk ) వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నిమ్మ పండు తొక్కలను పాలతో సహా వేసుకోవాలి.అలాగే ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్లు చందనం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.15 నిమిషాలు అనంతరం ఐస్ మొక్క తీసుకొని చర్మానికి బాగా రుద్దాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా కనుక చేశారంటే చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు( Deadskin Cells) తొలగిపోతాయి.
చర్మం లోతుగా శుభ్రం అవుతుంది. స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.
నిమ్మ తొక్కలు, చందనం పొడి, తేనె, పాలు, పసుపు.ఇవన్నీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.న్యాచురల్ గ్లో( Natural Glow ) ను అందిస్తాయి.వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకోవడానికి బదులుగా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ రెమెడీని పాటించారంటే ఖర్చు లేకుండా ఫేషియల్ గ్లో స్కిన్ ను మీ సొంతం కావచ్చు.పైగా ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం పై ముదురు రంగు మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య సైతం దూరం అవుతుంది.