మన భారత దేశంలో ఎన్నో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు( Shrines , temples ) ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలను ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న పుణ్య క్షేత్రాలకు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా దక్షిణాదిలో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి.
అలాగే ఎన్నో ఆలయాలు పాతబడిపోతున్నాయని చాలా మంది ప్రజలు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పురావస్తు శాఖ తవ్వకాల్లో కొన్ని ఆలయాలు బయటపడుతూ ఉంటాయి.
అలాంటి ఆలయం ఒకటి కర్ణాటకలో 1997లో బయట పడింది.
ఇంకా చెప్పాలంటే బెంగళూరులోని శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి( Sri Dakshinamukha Nandi Theertha Kalyani in Bangalore ) ప్రాంతంలో 400 సంవత్సరాల క్రితం నాటి శివాలయం 1997లో వెలుగులోకి వచ్చింది.ఆ తవ్వకాలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి ప్రాంతంలో కొందరు కార్మికులకు మొదట ఒక నంది విగ్రహం కనిపించింది.
దీనితో ఆశ్చర్యపోయిన కార్మికులు మరింత లోతుగా తవ్వగా వారికి ఒక శివలింగం కనిపించింది.ఆ తర్వాత తవ్వకాల్లో మొత్తం శివాలయం బయటపడినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయనికి 400 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఉందని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు సమాచారం.అలాగే బెంగళూరు నగరానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న మల్లేశ్వరం లే అవుట్ లోని రెండవ దేవాలయం వీధిలో ఈ దేవాలయం ఉంది.ఈ దేవాలయాన్ని నంది తీర్థం, నందీశ్వర తీర్థం, బసవ తీర్థం, మల్లేశ్వరం నంది దేవాలయం అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయం ఒక అద్భుతం అని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే ఈ భూమి క్రింది భాగంలో మనకు తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
DEVOTIONAL