వాస్తు శాస్త్రంలో పసుపును ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసా..?

సాధారణంగా చెప్పాలంటే పసుపు లేకుండా ఏ వంటగది ఉండదని దాదాపు చాలా మందికి తెలుసు.ప్రతి వంటకంలో పసుపు కచ్చితంగా ఉండాల్సిందే.

 According To Astrology Turmeric Uses,astrology, Turmeric ,vastu Tips,financial P-TeluguStop.com

ఇక పసుపులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా చెప్పాలంటే పసుపు( Turmeric ) అంటే మనకు ముందుగా గుర్తొచ్చే విషయం యాంటీబయోటిక్.

అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో పసుపు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.అందుకే గాయమైన వెంటనే పసుపు రాసుకోమని పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే పసుపు కేవలం ఔషధ గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది.ప్రతి పూజలో కచ్చితంగా పసుపు ఉండాలని ఈ పండితులు చెబుతున్నారు.

ఏ శుభకార్యమైన పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు.


Telugu Astrology, Red, Turmeric, Vastu Tips-Latest News - Telugu

అంతలా జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో పసుపు కు ప్రాధాన్యత ఉంది.

ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు ఇంటి వాస్తులో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.అవును పసుపుతో కొన్ని రకాల వాస్తు దోషాలను దూరం చేసుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పసుపు ద్వారా వాస్తు సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇందుకోసం మీరు చేయాల్సిందేల్లా పసుపును ఒక ముద్దలా చేసి ఎరుపు రంగు వస్త్రం( Red Cloth )లో కట్టాలి.అనంతరం ఆ వస్త్రాన్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.

Telugu Astrology, Red, Turmeric, Vastu Tips-Latest News - Telugu

డబ్బు వృధాగా ఖర్చు అవుతున్న సంపాదించినదంతా నీళ్లలా ఖర్చవుతున్న వారికి ఈ వాస్తు చిట్కా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు( Financial Problems ) కూడా దూరమవుతాయి.అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతి రోజు పసుపు నీటిని చల్లడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయని కూడా వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube