లక్ష్మీదేవిని అష్టలక్ష్మి అని ఎందుకు అంటారో తెలుసా..?

లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ధనానికి లోటే ఉండదని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఎందుకంటే హిందూ ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు, శ్రేయస్సుకు దేవతగా భావిస్తారు.

 Do You Know Why Goddess Lakshmi Is Called Ashta Lakshmi , Lakshmi Devi , Dhair-TeluguStop.com

కానీ లక్ష్మీదేవిని అష్టలక్ష్మి అని కూడా అంటారు.ఇలా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవికి ఒకటి కాదు ఎనిమిది రూపాలు అని దాదాపు చాలా మందికి తెలుసు.అందులో ఒక రూపమే అష్టలక్ష్మి( Ashta Lakshmi ) పేరు ప్రకారం శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలలో ఉంది.

అందుకే భక్తులు తమ కోరికలను నెరవేరడానికి లక్ష్మీదేవి వివిధ రూపాలను పూజించాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఆదిలక్ష్మి లేదా మహాలక్ష్మి రూపాలను లక్ష్మీదేవి మొదటి రూపంగా భావిస్తారు.

సుఖ సంతోషాలు సిరిసంపదలు పొందడానికి లక్ష్మీదేవిని పూజిస్తారు.

Telugu Ashta Lakshmi, Devotional, Dhairya Lakshmi, Dhanalakshmi, Lakshmi Devi, S

రెండవ రూపం ధనలక్ష్మి రూపం పేరుకు తగ్గట్టుగానే ధనలక్ష్మి( Dhanalakshmi )ని సంపద కోసం పూజిస్తారు.ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి.ధాన్యలక్ష్మి అంటే ఆహార సంపద.

ఈ రూపాన్ని ఎప్పుడు పూజించిన మీ ఇంట్లో ఆహారనికి ఎటువంటి లోటు ఉండదు.నాలుగవ రూపం గజలక్ష్మి రూపం.

గజలక్ష్మి తామర పువ్వు పైన కూర్చుని దానికి ఇరువైపులా ఏనుగులను కలిగి ఉంటుంది.అందుకే ఆమెను గజలక్ష్మి అని అంటారు.

రెండు వైపులా ఉన్న ఏనుగులు తమ తొండంలో ఉన్న నీటితో గజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి.ఐదవ రూపం సంతాన లక్ష్మి రూపం.

సంతాన లక్ష్మినీ 5వ రూపంగా భావిస్తారు.పేరుకు తగ్గట్టుగా ఈ లక్ష్మీదేవిని పూజించడం వల్ల పిల్లల సంతోషాన్ని పొందుతారు.

Telugu Ashta Lakshmi, Devotional, Dhairya Lakshmi, Dhanalakshmi, Lakshmi Devi, S

అమ్మవారి ఒడిలో ఒక బిడ్డ, రెండు చేతుల్లో కుండలు, ఒక కత్తి కవచం ఉంటాయి.లక్ష్మీదేవి ఆరవ రూపం ధైర్యలక్ష్మి( Dhairya Lakshmi ) పేరుకు తగ్గట్టుగానే ఈ రూపం జీవిత పోరాటాలను జయించే ధైర్యాన్ని అందిస్తుంది.దైర్యలక్ష్మీ ఎనిమిది చేతులలో వివిధ రకాల ఆయుధాలు ఉంటాయి.యుద్ధంలో విజయం సాధించాలనే వారు ఈ అమ్మవారిని పూజిస్తారు.విజయలక్ష్మిని అష్టలక్ష్మి ఏడవ రూపంగా భావిస్తారు.ఇక్కడ గెలుపు అంటే విజయం.

లక్ష్మీదేవి ఈ రూపం తన భక్తులకు అభయాన్ని అందిస్తుంది.అందుకే మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు విజయలక్ష్మిని పూజించాలి.

విద్యాలక్ష్మి ని అష్టలక్ష్మి ఎనిమిదవ రూపంగా భావిస్తారు.తన పేరు లాగే విద్యాలక్ష్మి విద్యను జ్ఞానాన్ని అందిస్తుంది.

ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల మేధాశక్తి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube