ప్రతి శనివారం రోజు చాలా మంది శని దేవున్ని( Shanidev ) దర్శించుకుని నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ తర్వాత నువ్వులతో పూజలు చేస్తూ ఉంటారు.ఇలా చేస్తే శని ప్రభావం తమ పై ఉండదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అయితే శనీశ్వరుడిని పూజించడం మంచిదే కానీ శని భగవానుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ప్రజలు ఎంత డబ్బు సంపాదించినా వారి చేతిలో అసలు ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు.
అలాగే శని ప్రభావం( Shani Effect ) ఉంటే వారికి అస్సలు కలిసి రాదు.అందుకే చాలా మంది శని దేవుడి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే శనీశ్వరుని దేవాలయానికి( Shanidev Temple ) వెళ్ళినప్పుడు శని భగవానుడి విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదని నిపుణులు చెబుతున్నారు.అలాగే శనీశ్వరుడి నేత్రాలలోకి కూడా చూడకూడదు.శని దేవుడికి పూజలు( Shani Pooja ) చేసేటప్పుడు ఎప్పుడూ ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలని పండితులు చెబుతున్నారు.శనికి ఎదురుగా నిలబడి మొక్కుకోవడం,అలాగే నేరుగా శనీశ్వరుడు ఈ నేత్రాలలోకి చూడడం లాంటివి అసలు చేయకూడదు.
శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు బట్టలను ధరించకూడదు.నీలం లేదంటే నలుపు రంగు దుస్తులు( Black Clothes ) మాత్రమే ధరించాలి.
ఈ రంగులు శని దేవుడికి ఇష్టమైన రంగులు అని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే శని దేవుడికి నూనెతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రలు అసలు ఉపయోగించకూడదు.శనికి ఇనుము అంటే ఎంతో ఇష్టం.అందువల్ల శని దేవునికి అభిషేకం చేసేటప్పుడు ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ప్రతి శనివారం శనీశ్వరుడి దేవాలయంలో నువ్వులు, ఉలవలు లేదా శనగలను దానం చేయడం ఎంతో మంచిది.శని దేవాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు వెన్ను చూపించి బయటకు రాకూడదు.