ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి జీవితంలో మంచి సంబంధాలు కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.అది మీ కుటుంబం లేదా స్నేహితులు కావచ్చు.
బాగా కనెక్ట్ అయినా వ్యక్తులు మీ జీవితంలోని కష్టాలలో మీకు తోడుగా ఉంటారు.ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించాలంటే మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
అందుకే మంచి బంధాలు బలహీన పడకుండా చూసుకోవాలి.ఒక వ్యక్తి సంబంధాలను బలంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో చాణక్యుడు తన చాణక్య నీతిలో వెల్లడించాడు.
చాణక్య నీతి( Chanakya niti ) భార్యాభర్తల సంబంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో, వైవాహిక జీవితంలో దృష్టి పెట్టవలసిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడి ప్రకారం ప్రతి జంట ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.వీటిని దృష్టిలో పెట్టుకోకుంటే మీ సంబంధం త్వరలో బలహీనపడుతుంది.చాణక్యుడి ప్రకారం భార్య భర్తల( Husband ) మధ్య సంబంధం లో ఎలాంటి సందేహం ఉండకూడదు.
ఏదైనా సంబంధాన్ని బలహీన పరచడంలో అనుమానం ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇది అపార్ధానికి దారి తీస్తుంది.ఈ విషం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తుంది.రిలేషన్ షిప్( Relationship ) లో గొడవలు తలెత్తితే అవి త్వరగా తగ్గవని చెబుతున్నారు.
అలాగే దంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమను నాశనం చేసే వాటిలో అహంకారం కూడా ఒకటి.అహంకారం వైవాహిక సంబంధాన్ని నాశనం చేసే అంశంగా పరిగణిస్తారు.
దంపతులు ఇద్దరు అహంకారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.భార్యాభర్తల( Wife ) మధ్యలో అహంకారానికి చోటు ఇవ్వకూడదు.ఇంకా చెప్పాలంటే మితిమీరిన కోపం ఏదైనా సంబంధాన్ని నాశనం చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.దంపతులు మంచి సంబంధాన్ని కొనసాగించడానికి సహనంతో ఉండాలి.ఓపికగా ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోగలడు.ప్రతి కష్టం నుంచి బయటపడగలరు.
క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటాడు.భార్య భర్తల సంబంధాలు సంతోషంగా కొనసాగించడానికి ఎల్లప్పుడూ సహనంతో ఉండడం మంచిది.
DEVOTIONAL