టైటానిక్‌ షిప్ దగ్గరకి జేమ్స్ కామెరూన్ అన్నిసార్లు ఎలా వెళ్లగలిగారు?

టైటానిక్( Titanic shi ) శకలాల్ని చూసేందుకు వెళ్లిన సబ్మెరైన్ టైటాన్ గల్లంతైన సంగతి అందరికీ తెలిసినదే.గత మూడు నాలుగు రోజులుగా అందులోని ఐదుగురు ప్రయాణికులను కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 How Did James Cameron Get To The Titanic Ship All The Time? Latest News, Telugu-TeluguStop.com

తాజాగా ఆ ఐదుగురూ చనిపోయినట్టు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలో టైటాన్ గురించిన అనేక విషయాలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

టైటానిక్ టూర్ అనేది చాలా సాహసంతో కూడుకున్నది.సముద్రంలో దాదాపు 13 వేల అడుగుల లోతుకి వెళ్లి రావడం అంటే అంత తేలికైన విషయం కాదు.

కానీ థ్రిల్ కోసం వెళ్లి కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు కొందరు బడాబాబులు.

Telugu Time, Catastrophic, Crew, Latest, Latestjames, Telugu Nri, Titanic Ship,

ఈ ఐదుగురు కుబేరులు కూడా అలాగే వెళ్లి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు.అసలు ఇంతగా థ్రిల్ ఫీల్ అయ్యేంత ఏముంటుంది ఈ టూర్లో అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న? అది అత్యంత ప్రమాదకరమని తెలిసినా బిలియనీర్లు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? 1912లో టైటానిక్ షిప్ మునిగిపోయింది.ఇప్పటికి దాదాపు 111 ఏళ్లు గడిచిపోయాయి.

ఆ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా వాటి శకలాలు ఎక్కడో సముద్ర గర్భంలో చిక్కుకున్నాయి.

వాటిని బయటకు తీయడం అసాధ్యం.అందుకే అక్కడే ఉంచేశారు.

కానీ.కొంతమంది ఔత్సాహికులకు అక్కడికి వెళ్లి దానిని తిలకించి ఏదో మిస్టరీని సాధిద్దామని కోరిక.

కానీ అదే కోరిక ఇపుడు కొంతమందికి బలిగొంటుంది.

Telugu Time, Catastrophic, Crew, Latest, Latestjames, Telugu Nri, Titanic Ship,

అయితే అంత రిస్క్ అయినటువంటి పయనాన్ని 1997లో డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ( James Cameron )టైటానిక్ సినిమా తీసే భాగంలో ఏకంగా 32 సార్లు చేసాడని ఎవరు వూహించగలరు? కాగా ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనమైన సంగతి అందరికీ విదితమే.ఇపుడు చాలామందికి అంతుచిక్కని ప్రశ్న ఏమిటంటే….ఎవ్వరికీ సాధ్యం కానిపని జేమ్స్ కామెరూన్ కి ఎట్టా సాధ్యమైంది అని? సాధారణంగా సముద్ర గర్భంలో 13 వేల అడుగుల లోతు వరకూ వెళ్లే కొలదీ సముద్రంలో ప్రెజర్ ఎక్కువవుతూ ఉంటుంది.ఎక్కువ సేపు అక్కడే ఉంటే ఒత్తిడి తట్టుకోలేక ఏ వస్తువైనా సహజంగా పేలిపోతుంది.ఇప్పుడు టైటాన్ విషయంలో జరిగింది ఇదే.ఓషన్ గేట్ ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేస్తుంది.అంటే…ఇంత డబ్బు ఇచ్చి మరీ చావుని కొని తెచ్చుకున్నారు ఆ ఐదుగురు ప్రయాణికులు.ఇదే సమయంలో జేమ్స్ కామెరూన్ అక్కడికి వెళ్లి మరలా సురక్షితంగా ఎలా వచ్చారా అని?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube