భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో( ODI World Cup ) విశ్వ విజేతగా నిలవడం కోసం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లు భారత్ కు చేరాయి.
వరల్డ్ కప్ కు ముందు జరిగే వార్మప్ మ్యాచులు మొదలయ్యాయి.అక్టోబర్ ఐదు నుండి అసలైన మ్యాచులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మొదలు అవ్వనున్నాయి.
ఇప్పటికే ఏ జట్లు అద్భుత ఆటను ప్రదర్శిస్తాయో.ఏ జట్లు సెమీఫైనల్ కు చేరుతాయో.
ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందో అనే అంశాలపై క్రికెట్ నిపుణులతో పాటు క్రికెట్ అభిమానులు రివ్యూలు కూడా ఇస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ రివ్యూల పై సరికొత్త చర్చే జరుగుతోంది.
ఇక సోషల్ మీడియాలో మరో వార్త చేరి పెద్ద చర్చకు దారితీసింది.

అంతర్జాతీయ క్రికెట్లో రాణించి లెజెండరీ క్రికెటర్లుగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొంతమంది సీనియర్ ఆటగాళ్లు( Senior Cricketers ) ఈ వన్డే వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.వన్డే వరల్డ్ కప్ ఆడే 10 జట్లలో కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు వయస్సు కారణంగా ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇంతకీ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ముందుగా భారత జట్టు విషయానికి వస్తే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ,( Rohit Sharma ) భారత జట్టులో కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఫిట్నెస్ గా ఉన్న వయస్సు కారణంగా రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్,( Steve Smith ) డేవిడ్ వార్నర్,( David Warner ) మీచల్ స్టార్క్. ఇంగ్లాండ్ కు చెందిన జోరూట్, బెన్ స్టొక్స్.న్యూజిలాండ్ ప్లేయర్ విలియమ్సన్,( Kane Williamson ) బంగ్లాదేశ్ ప్లేయర్ షాకీబ్ అల్ హసన్.
వయస్సు కారణంగా రిటైర్ అయ్యే అవకాశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.వీరి ఫిట్నెస్ విషయానికి వస్తే యువ ఆటగాళ్లకు గట్టి పోటీనే ఇస్తారు.వన్డే వరల్డ్ కప్ తర్వాత ఎవరు కొనసాగుతారు, ఎవరు ఎప్పుడు వీడ్కోలు పలుకుతారు అనేది ఆసక్తికరంగా మారింది.