కార్తికేయ 2 డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న స్టార్ ఓటీటీ సంస్థ?

దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈనెల 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అవరోధాలను తొలగించుకొని ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Karthikeya 2 Is The Star Ott Company That Has Acquired The Digital Rights , Nikh-TeluguStop.com

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పరుగులు పెడుతుంది.ఇకపోతే ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత తిరిగి ఆ సినిమాని డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిఖిల్ కార్తికేయ 2 సినిమా డిజిటల్ రైట్స్ ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరలకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని థియేటర్ లో విడుదల అయ్యి ఆరువారాలను పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ సానుకూలంగా ఉన్నారని చెప్పాలి.

Telugu Anupama, Chandu Mondeti, Swathi, Karthikeya, Nikhil, Tollywood, Zee-Movie

ఇక నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా 2014లో కార్తికేయ సినిమాలో నటించారు.ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ఇందులో హీరోయిన్ కలర్స్ స్వాతికి బదులు అనుపమ పరమేశ్వరన్ నటించారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో నిఖిల్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube