2004లో సరిగ్గా 20 ఏళ్ల క్రితం శర్వానంద్( Sharwanand ) కెరీర్ మొదలైంది.ఐదో తారీకు, గౌరీ శంకర్, దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన ఆయన యువసేన సినిమాల్లో నలుగురు హీరోల్లో ఒకడిగా మొట్టమొదటిసారి మెయిన్ లీడ్ పాత్రలో నటించారు.
సంక్రాంతి సినిమాలో సైతం అన్నదమ్ముల్లో ఒకడిగా కనిపించిన శర్వానంద్ వెన్నెల సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించారు.మొట్టమొదటిగా 2006లో అమ్మ చెప్పింది సినిమాతో సోలో హీరోగా ఆయన నటించారు.ఆ తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీస్తూ వస్తున్నారు.2014 రన్ రాజా రన్ సినిమా విజయం సాధించేంత వరకు ఆయన ప్రతి ఏటా ఒక సినిమాను విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.

2015లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు( Malli Malli Idi Rani Roju ) అనే సినిమా తీయగా అలాగే JK ఎనుమ్ నంబనిన్ వాజ్కై అనే మరో తమిళ సినిమాలో కూడా నటించారు.ఇక 2016 లో ఎక్స్ప్రెస్ రాజా, రాజా ధి రాజా అనే చిత్రాలతో తెరపై సందడి చేయగా 2017లో శతమానం భవతి, రాధా, మహానుభావుడు వంటి మూడు సినిమాల్లో నటించారు.2018లో పడి పడి లేచే మనసు 2019లో రణరంగం, 2020లో జాను 2021లో శ్రీకారం, మహాసముద్రం( Mahasamudram ) 2022లో ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించారు.ఇలా దాదాపు 10 ఏళ్లపాటు ఏటా రెండు సినిమాలు తీస్తున్న శర్వానంద్ గత రెండేళ్లలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
తన గత సినిమాలు వరుసగా పరాజయాలు చవిచూస్తున్న ఈ సమయంలో ఆయన ఒక్కసారిగా రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వడం అనేది చాలామందికి లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.ఎందుకంటే అతనికి అవకాశాలు రావడం లేదా లేక ఆచితూచి సినిమా చేయాలని భావిస్తున్నాడా అనేది అర్థం కావడం లేదు.
ఇక ఈ సమయంలోనే అతనికి పెళ్లి అయ్యి కూతురు కూడా పుట్టింది.అయినా కూడా తన సినిమాల గురించి ఎలాంటి ఊసు లేదు.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం 2024లో ఏకంగా మూడు సినిమాలకు శర్వానంద్ ఓకే చెప్పాడట.శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈ మూడు సినిమాల గురించి వివరాలు అందజేశారు.శ్రీరామ్ ఆదిత్య( Sriram Adithya ) దర్శకత్వంలో మనమే అనే ఒక చిత్రానికి పచ్చ జెండా ఊపాడట శర్వానంద్.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు.
UV క్రియేషన్స్ లో ఇప్పటికే ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మహానుభావుడు వంట సినిమాలు చేయగా ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పాడట.ఇదే కాకుండా సామజవరగమన సినిమాతో బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజ్ కి కూడా ఓ సినిమాకి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది.