నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) లో ఇప్పటి వరకు మనమెవ్వరం చూడని కోణాన్ని చూపించిన టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’( Unstoppable with NBK ).ఈ టాక్ షో ఇండియాలోనే ది బెస్ట్ టాక్ షో గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.
బాలయ్య లో ఇంత ఫన్ యాంగిల్ కూడా ఉంటుందా అని అందరికీ చూపించిన టాక్ షో ఇది.ఇప్పటి వరకు రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో కి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ముఖ్య అతిధులుగా విచ్చేసి బాలయ్య బాబు( Balayya Babu ) తో కాసేపు సరదాగా గడిపి వెళ్లారు.వీళ్ళతో పాటుగా మాస్ మహారాజ రవితేజ, శర్వానంద్ మరియు న్యాచురల్ స్టార్ నాని వంటి హీరోలతో పాటుగా మోహన్ బాబు వంటి సీనియర్ నటులు కూడా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

అంత బాగానే ఉంది కానీ, బాలయ్య తరం హీరోలు ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ టాక్ షో లో పాల్గొనలేదు.చిరంజీవి, వెంకటేష్ మరియు నాగార్జున వంటి నటులకు ఆహ్వానం అందినా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఈ బిగ్గెస్ట్ టాక్ షో కి హాజరు కాలేకపోయారు.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 3 లిమిటెడ్ వెర్షన్ ప్రారంభం అయ్యింది.
మొదటి ఎపిసోడ్ ని ‘భగవంత్ కేసరి’ మూవీ టీం తో చేసారు, రెండవ ఎపిసోడ్ ని సీనియర్ హీరోయిన్స్ తో కానిచ్చేశారు.కానీ చివరి ఎపిసోడ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )తో చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.
నవంబర్ 10 వ తారీఖున దీపావళి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఇదే కనుక నిజమైతే మెగా మరియు నందమూరి అభిమానులకు కనులపండుగే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం చిరంజీవి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇటలీ కి పయనం అయ్యాడు.నవంబర్ నాల్గవ తేదీ వరకు అక్కడే ఉంటాడు.మెగా ఫ్యామిలీ కుటుంబం మొత్తం కూడా ఇటలీ కి పయనమైన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇటలీ నుండి ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే చిరంజీవి ‘అన్ స్టాపబుల్’ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
ఈ షోకి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి, గతం లో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్న సమయం లో ఓవర్ ట్రాఫిక్ కారణంగా ఆహా మీడియా సర్వర్లు క్రాష్ అయ్యాయి.మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందో లేదో చూడాలి.