ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఎన్నో ఆచారాలను సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే శ్రవణ మాసం( Shravana Masam )లో మనం అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని కూడా చెబుతూ ఉంటారు.
ఈ సారి శ్రావణమాసం ఆగస్టు 17వ తేదీన మొదలై సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది.
అయితే సనాతన ధర్మం ప్రకారం ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులను ఉపయోగించడం, లేదంటే ధరించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది.కాబట్టి పచ్చని వస్తువులను కనుక మీ దగ్గర ఉంచుకుంటే బుధ గ్రహం సంతోష పడుతుందని చెబుతున్నారు.
పండితులు చెప్పిన దాని ప్రకారం పచ్చని ప్రకృతికి ప్రతికాగా శ్రావణమాసంలో పచ్చని గాజులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది.ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవడం వల్ల వరలక్ష్మి దేవి, మంగళ గౌరీ దేవి( Mangala Gowry Devi ) మంచి చేస్తారని ప్రజలు నమ్ముతారు.
అంతే కాకుండా శ్రావణమాసంలో ముత్తైదువులు పచ్చని గాజులు వేసుకొని నోములు చేస్తే చేసినవారికి, అలాగే వారి కుటుంబానికి మంచి జరుగుతుంది.</br
ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో పచ్చని గాజులు వేసుకుంటే ఎంతో శుభం జరుగుతుంది.అలాగే పచ్చని గాజులు వేసుకొని శంకరుడి( Lord Shiva )ని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఆకుపచ్చ రంగు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం.
శ్రావణమాసంలో పచ్చని గాజులు వేసుకొని దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు.ముత్తైదువులకి గాజులు వాయినం గా కూడా ఇస్తూ ఉంటారు.
ఇలా పచ్చని గాజులను వేసుకుంటే ఇన్ని లాభాలను పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
DEVOTIONAL