మానవ జీవితాన్ని సరళంగా విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలు చాణక్య నీతిలో( Chanakya Niti ) ఉన్నాయి.జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడమే ఆనందానికి ముఖ్య రహస్యం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అయితే జీవితంలో ఎలాంటి సమస్య అయినా ఎలా అధిగమించాలో నేర్చుకోవడమే విజయ రహస్యం.సంతోషకరమైన జీవితాన్ని( Happy Life ) గడపడానికి అవసరమైన రహస్యాల గురించి చాణక్యుడు తన పుస్తకంలో వెల్లడించాడు.
ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా వివరించాడు.ఇలా చేస్తే మనశ్శాంతి దూరం అవుతుంది.
ఇద్దరు తెలివైన వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు వారి సంభాషణకు ఎవరు అంతరాయం కలిగించకూడదని చాణక్యుడు చెప్పాడు.అలా చేస్తే వారి పనికి ఆటంకం కలుగుతుంది.దీనినే మూర్ఖత్వం అంటారు.తెలివైన వ్యక్తి( Clever Man ) ఎప్పటికీ ఇలా చేయడు.అలాంటప్పుడు వాళ్ళ మధ్యకి వెళితే వాళ్లు నిన్ను మూర్ఖుడని అనుకుంటారు.ఇది మీ ప్రతిష్ట గౌరవాన్ని పాడు చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాలు అని చాణిక్యుడు తన చాణిక్య నీతిలో వెల్లడించాడు.
భార్య భర్తలు( Couples ) కలిసి కొన్ని పనులు చేసేటప్పుడు మూడో వ్యక్తి వారి పనిలో జోక్యం చేసుకోకూడదని చాణక్యుడు తెలిపాడు.అలాగే వారి సంభాషణకు ఎవరు అంతరాయం కలిగించకూడదు.ఇది వారి గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది.
ఇంకా చెప్పాలంటే నాగలి, ఎద్దు కలిసి వెళ్లేటప్పుడు వాటి మధ్య వెళ్ళకూడదు.ఇది మీకు బాధ కలిగించవచ్చు.
ఈ తప్పు చేస్తే మరణానికి దారి తీస్తుందని చాణక్యుడు చెప్పాడు.యాగకుండం దగ్గర పూజారి( Poojari ) కూర్చొని పూజలు చేస్తున్నప్పుడు ఎవరు దాని గుండా వెళ్ళకూడదు.ఇలా చేయడం వల్ల వారి పూజకు ఆటంకం కలుగుతుంది.ఇది ఒక వ్యక్తిని పాపంలో భాగస్వామిని చేస్తుంది.చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి పై విషయాలలో లేదా వారి జీవితంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు.ఇది మరణం లేదా నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది.
DEVOTIONAL