సాధారణంగా అందరూ భగవంతుని పూజిస్తే ఈ గ్రామంలో కుక్కలకు గుడి కట్టి పూజిస్తున్నారు.గ్రామ దేవతకు ముందు ఈ శునకాలకి తొలి పూజ నిర్వహిస్తున్నారు.
కర్ణాటక( Karnataka )లో ఉన్న ఈ అరుదైన దేవాలయం నిర్మించడానికి ఒక కారణం కూడా ఉంది.ఆ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడైనా దేవుడికి గుడి కట్టడం పూజలు చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.కానీ కర్ణాటక రామనగర జిల్లా( Ramanagara )లోని ఒక గ్రామంలో మాత్రం కుక్కలకు దేవాలయం నిర్మించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.
గ్రామ దేవత కన్నా ముందు కుక్కలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు గ్రామస్తులు అంతా వచ్చి కుక్కలను దర్శించుకుంటూ ఉంటారు.జిల్లాలోని అగ్రహార వలగెరెహళ్లి( Agrahara Valagerehalli village ) గ్రామస్తులు తెలిపిన విషయాల ప్రకారం కుక్కలకు ఆలయం నిర్మించడానికి ఒక కారణం ఉంది.సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో కాపరులు గొర్రెలను రక్షించుకోవడానికి కుక్కలను పెంచుతూ ఉంటారు.
అదే తరహాలో అగ్రహార వలగెరెహళ్లి గ్రామానికి చాలా ఏళ్ల క్రితం గొర్రెల కాపరులు ఏదో పని మీద వచ్చారు.ఆ గొర్రెలతో పాటు కుక్కలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత శునకాలు కనిపించకుండా పోయాయి.
అయితే ఆ కుక్కలు కనిపించకపోవడం వల్ల ఆందోళనకు గురైన గ్రామస్తులు తమ గ్రామ దేవత అయిన వీరమస్తి కెంపమ్మ దేవాలయానికి వెళ్లారు.అప్పుడు అడవిలోని కెంపమ్మ దేవాలయానికి ద్వార పాలకులు కావాలనీ ఆ దేవత తెలిపింది.దీనివల్ల గ్రామస్తులు పాలరాతితో రెండు కుక్కల విగ్రహాలను తయారుచేసి దేవాలయంలో ప్రతిష్టించారు.
అప్పటినుంచి ఈ రెండు కుక్కలు గ్రామానికి కాపలాగా ఉంటూ దుష్టశక్తుల నుంచి తమను కాపాడుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు.గ్రామ దేవతకు కొలిచే ముందు ఈ కుక్కలకే పూజ చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ శునకాలకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.దీనివల్ల సంవత్సరానికి ఒకసారి ఈ గ్రామంలో జరిగే జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.
భక్తులు ముందుగా కుక్కలకు తొలి పూజ నిర్వహించి ఆ తర్వాత వీరమస్తీ కెంపమ్మ దర్శనం చేసుకుంటారు.
LATEST NEWS - TELUGU