గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందేవారికి భారీ షాక్..

సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ పొందే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.ప్రతి నెల సబ్సిడీని భారీగా తగ్గిస్తుంది.2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీకి కేటాయింపుల్ని కేంద్ర ఆర్థిక శాఖ తగ్గించింది.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి కేటాయింపుల్ని తగ్గిస్తుంది.

 Lpg Subsidy Gas Cylinder Price May Hike Soon, Lpg Gas Cylinder Price, Gas Cylind-TeluguStop.com

గత సంవత్సరంలో సబ్సిడీ 40,915 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం 12,995 కోట్లు మాత్రమే కేటాయించింది.

గత సంవత్సరం డిసెంబర్ నుండి ఇప్పటి వరకు గ్యాస్ ధరలు 125 రూపాయలు పెరిగింది.

దీంతో సామాన్యులకు గ్యాస్ మరింత భారమైంది.గతంలో సబ్సిడీ ధరకే సిలిండర్ లభించేది.

కానీ కేంద్ర ప్రభుత్వం 2013 లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించింది.అంటే ముందు మొత్తం డబ్బులు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేస్తే ఆ తర్వాత లబ్ది దారుని ఖాతాలోకి సబ్సిడీ నగదు వేసేవారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది.మొత్తం 26.5 కోట్ల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సిలిండర్ ను అందిస్తుంది.సబ్సిడీ నగదును కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెట్రోలియం సబ్సిడీకి కూడా కేటాయింపులు ఉంటాయి.

Telugu Central, Gas Cylinder, Hpgas-Latest News - Telugu

కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర 1000 రూపాయలు ఉన్నప్పుడు 500 రూపాయలపైనే సబ్సిడీ ఇచ్చేది.కానీ ఇప్పుడు 170 రూపాయలలోపే సబ్సిడీ ఇస్తుంది.అందుకే ప్రజలు ఒక్క సిలిండర్ కు 600 రూపాయలు వరకు చెల్లించాల్సి వస్తుంది.

అయితే ఓవైపు ఉజ్వల స్కీమ్ ద్వారా లబ్దిపొందే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.ఈ స్కీమ్ వల్ల ఇప్పటికే కోటి మంది లబ్ది పొందుతున్నారు.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధించడం వల్ల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గించడం వల్ల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచక తప్పదు.

అందువల్ల సబ్సిడీ సిలిండర్లు పొందుతున్నవారిపై, ఉజ్వల స్కీమ్ లబ్ది దారులపై కూడా ఈ భారం పడుతుంది.కేంద్ర ప్రభుత్వం దశలవారీగా సబ్సిడీని తగ్గించబోతుంది.దీని వల్ల కిరోసిన్, వంట గ్యాస్ ధరలు కూడా దశల వారీగా పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube