కారు ఎక్కేందుకు వెళ్లిన మ‌హిళ‌కు షాక్‌.. అందులోంచి ఏం దిగిందో చూస్తే

కొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్ల గ‌గ్గురుపొడుస్తుంది.ఇలా ఉందేంట్రా బాబు అనిపిస్తుంది.

 Shock To The Woman Who Went To Climb In The Car If You See What Got Out Of It ,-TeluguStop.com

ఇక ఇలాంటి ఉత్కంఠ భ‌రిత‌మైన‌, భ‌యాన్ని ఉసిగొల్పే వీడియోల‌కు మామూలుగానే సోష‌ల్ మీడియాలో మంచి ఆద‌ర‌ణ ఉంటుంది.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ భ‌యాన‌క వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియో చూస్తేనే వ‌ణుకు పుట్టేలా ఉంది.కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవేమో అనిపించేలా ఉంది.

ఇక దీన్ని చూసిన వారంతా కూడా తెగ వైర‌ల్ చేసేస్తున్నారు.మ‌రి ఇంత‌లా అందులో ఏం ఉందో తెలుసుకుందాం.

ఈ వీడియో చూస్తుంటే ఓ మహిళ త‌న ఇంట్లో నుంచి ఏదో ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లేందుకు రెడీ అవుతుంది.అయితే ఆమె త‌న కారు వ‌ద్ద‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది.

అయితే కారు వద్దకు వెళ్లి అందులో ఎక్కేందుకు సిద్ధం అవుతుండ‌గా స‌డెన్‌గా అందులోంచి నల్లటి భారీ శరీరంతో కూడిన‌టువంటి ఓ ఎలుగుబంటి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె ప‌రుగు, ప‌రుగున వెళ్లిపోయింది.దాన్ని చూసిన వెంట‌నే పెద్ద‌గా కేకలు వేస్తూ ప్రాణ భ‌యంతో వ‌ణికిపోయింది.

ఎక్క‌డ ఆ ఎలుగుబంటి త‌న ప్రాణాల‌ను తీస్తుందో అని తెరిచి ఉన్న కార్ డోర్‌ను క్లోజ్ చేయాల‌నుకుంది.

అయితే ఇలా ఆమె కారు డోర్‌ను క్లోజ్ చేసే లోపే ఆ ఎలుగుబంటి దిగిపోతుండ‌టంతో ఆమె గుండె ద‌డ‌దడ లాడిపోయింది.

వెంట‌నే త‌న చేతిలో ఉన్న పళ్ల బుట్టను పడేసి అక్క‌డి నుంచి క్ష‌ణ కాలంలో దూరంగా ప‌రుగులు తీసింది.అయితే ఆ ఎలుగు బంటి కింద‌కు దిగి అటు ఇటూ చూస్తూ కొద్ది దూరం వెళ్లింది.

అయితే మళ్లీ కారువైపునకు రావ‌డాన్ని మ‌నం వీడియోలో చూడొచ్చు.అఇయ‌తే ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో ఇది కాస్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube