మీ తలరాత ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో తెలుసా..?

మనిషికి సరైన జీవన విధానాన్ని తెలిపే పవిత్ర గ్రంథం శ్రీమాత్ భగవద్గీత( Shrimat Bhagavad Gita ) అని దాదాపు చాలా మందికి తెలుసు.భగవద్గీత ఒక వ్యక్తి జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠాలను బోధిస్తుంది.

 Do You Know What Factors Your Handwriting Depends On , Handwriting, Shrimat Bhag-TeluguStop.com

భగవద్గీత ( Bhagavad Gita )జ్ఞానం ప్రతి మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది.భగవద్గీత అనేది ఒక వ్యక్తి జీవిత తత్వశాస్త్రం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

దానిని అనుసరించే వ్యక్తి సమాజంలో ఉత్తమంగా భావిస్తాడు.శ్రీ మహా భగవద్గీత మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని వివరిస్తుంది.

వ్యక్తి విధిని ఏ అంశాలు నిర్ణయించగలవో గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.

Telugu Bhakti, Devotional, Lord Krishna, Shrimatbhagavad-Latest News - Telugu

భగవద్గీతలో శ్రీకృష్ణుడి( Lord Krishna ) ప్రకారం దేవుడు ఎవరి విధిని ముందుగా రాయడు.ఒక వ్యక్తి విధి అతని ఆలోచనలు ప్రవర్తన చర్యల ద్వారా నిర్ణయించబడుతుంది.అందుచేతనే శ్రీ కృష్ణుడు ప్రతి వ్యక్తి జీవితంలో మంచి పనులు చేయాలని సూచిస్తాడు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రతి వ్యక్తి తన మనసును అదుపులో ఉంచుకోవాలని వెల్లడించాడు.ఎందుకంటే మనస్సును అదుపు చేసుకోలేని వారికి అది శత్రువులా పని చేస్తుంది అని, ఆలోచనలపై మన మనసును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి అని, మనిషి వర్తమానాన్ని చూసి అతని భవిష్యత్తును అపహస్యం చేయకూడదని భగవద్గీతలో ఉంది.

Telugu Bhakti, Devotional, Lord Krishna, Shrimatbhagavad-Latest News - Telugu

ఎందుకంటే కాలానికి బొగ్గును వజ్రంగా మార్చే శక్తి ఉంది.అతని వర్తమానం భవిష్యత్తులో అతను కోరుకున్నట్టుగా మారవచ్చు.ధనవంతుడు పేదవాడు కావచ్చు.పేదవాడు ధనవంతుడు కూడా కావచ్చు.అర్థవంతమైన భగవద్గీతలో పేర్కొన్నట్లుగా భక్తుడు మౌనంగా నాపై విశ్వాసాన్ని ఉంచితే అతని మౌనానికి అతని విశ్వాసానికి నేను తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తానని భగవద్గీతలో ఉంది.నాపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూసే వాడిని మోసం చేయలేను అని భగవద్గీతలో ఉంది.

అలాగే ఉత్తమ మార్గంలో జీవించే వారు భయం, ఆందోళన, దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని భగవద్గీతలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube