ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ( ChatGPT ) అతిపెద్ద డేటాబేస్ ద్వారా ట్రైనింగ్ పొందింది.అందువల్ల ఏ విషయం గురించి అడిగినా ఇది చాలా లాజికల్‌గా, ఇంటెలిజెంట్‌గా సమాధానాలను ఇస్తూ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఇండియన్ క్రికెటర్ల బెస్ట్ షాట్స్ తెలపాలని ఓ యూజర్ అడగగా, ఈ ఏఐ చాట్‌బాట్ అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చింది.
టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) షార్ట్ పిచ్‌లలో ఫుల్ షాట్స్ బాగా ఆడతాడని చాట్‌జీపీటీ తెలిపింది.
మంచి టైమింగ్‌తో పవర్ ఫుల్ షాట్స్ ఆడడంలో ఇతనికి ఇతనే సాటి అని తెలిపింది.కాగా ఈ విషయంలో చాట్‌జీపీటీ నూటికి నూరు శాతం నిజం చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ( MS Dhoni ) హెలికాప్టర్ షాట్ బాగా ఆడతాడని ఈ ఏఐ బాట్ వెల్లడించింది.అంతేకాకుండా హార్థిక్ పాండ్య కూడా హెలికాప్టర్ షాట్‌ను కుంఫ్యూ స్టైల్లో కొడతాడని తెలిపి ఆశ్చర్యపరిచింది.

ఇక విరాట్ కోహ్లీ( Virat Kohli ) బెస్ట్ షాట్ గురించి కూడా ఈ బాట్ వెల్లడించింది.కింగ్ కోహ్లీ కూల్ గా కవర్ డ్రైవ్ ఆడతాడని ఇది తెలిపింది.బ్యాలెన్స్డ్ బాడీ లాంగ్వేజ్, సరైన టైమింగ్‌తో ఈ దిగ్గజ ప్లేయర్ కవర్ డ్రైవ్ షాట్ కొడితే ఫిదా అయిపోవాల్సిందేనని కూడా ఇది చెప్పుకొచ్చింది.

టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రైట్ డ్రైవ్ సూపర్ గా ఆడతారని ఏఐ బాట్ పేర్కొంది.చాట్‌జీపీటీ భారత క్రికెటర్ల బెస్ట్ షాట్ల గురించి 100% కచ్చితత్వంతో చెప్పి క్రికెట్ అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది.ఒక క్రికెటర్ల విషయంలోనే కాదు ప్రపంచంలోనే ప్రతీ స్పోర్ట్స్‌కి సంబంధించిన విశేషాలను క్షణాల్లో అందిస్తూ మోస్ట్ పవర్‌ఫుల్ ఏఐ టూల్‌గా చాట్‌జీపీటీ నిలుస్తోంది.







