పిల్లలు ప్రయోజకులు అయ్యేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడతారు.ముఖ్యంగా భర్త లేని మహిళలు తమ పిల్లలను చదివించుకునేందుకు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది పడతారు.
తమ పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడితే చాలా సంతోషిస్తారు.అయితే తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి కాలేజీ ఫీజు కట్టలేక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ సొమ్ముతో కొడుకు భవిష్యత్తు బాగుంటుందని భావించింది.కదులుతున్న బస్సు ముందు నిలబడి ఆత్మహత్య( Suicide ) చేసుకుంది.
ఆ మహిళ కలెక్టర్ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేసింది.ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి రూ.45 వేలు పరిహారంగా అందుతాయని ఎవరో చెప్పిన మాటలు నమ్మింది.చివరికి తన ఇద్దరు పిల్లలను అనాథలను చేసి చనిపోయింది.
ఈ విషాద ఘటన తమిళనాడు( Tamil Nadu )లోని సేలం జిల్లాలో జరిగింది.దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాపతి అనే 46 ఏళ్ల మహిళ భర్త చనిపోవడంతో ఆ మహిళ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.ఇటీవల ఆమె భర్త చనిపోయాడు.మహిళకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి.కూతురు కాలేజీ చదువు పూర్తయింది.కొడుకు ప్రైవేట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు.సేలంలోని రెండవ అగ్రహారం వీధి వద్ద వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.దీంతో ఆమె ప్రమాదం వల్ల మరణించలేదని, ఆత్మహత్య చేసుకుందని తేలింది.

ఈ ఘటనపై విచారణ చేయగా కన్నీరు పెట్టించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు రూ.45 వేలు ఆమెకు అవసరం పడ్డాయి.దాని కోసం బంధువుల వద్ద అప్పు అడిగినా వారు ఇవ్వలేదు.
దీంతో పోలీసులు మహిళ తన కుటుంబీకులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడగా లేవని వారు సమాధానమిచ్చారు.ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌గా చేస్తోంది.యాక్సిడెంట్ లో చనిపోతే కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని పాపతికి ఎవరో చెప్పారు.దీంతో కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకుంది.







