ఏపీలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసే పోటీ చేస్తాయా అనే వాదనలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోందని ఓ వైపు వాదనలు వినిపిస్తున్నాయి.మరోవైపు ఎన్డీయే కూటమి సమావేశానికి వెళ్లిన పవన్ ఏపీలో పొత్తులపై ఆ సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ మధ్య ఇంకా అవగాహనకు రావాల్సిన అంశాలు ఉన్నాయని పవన్ చెబుతున్నారు.అయితే త్వరలోనే పొత్తులపై క్లారిటీ వస్తుందని పవన్ తెలిపారు.
జనసేన కార్యకర్తలు తనను సీఎంగా చూడాలనుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్డీయేకు జనసేన సంపూర్ణ మద్ధతు ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తామని వెల్లడించారు.







