స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రధాన పాత్ర లో గుణ శేఖర్ ( Guna Shekhar )స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం( Sakunthalam ) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ గా కలెక్షన్స్ రాబడుతుందని ఆశించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది.100 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా కు కనీసం పాతిక కోట్ల కలెక్షన్స్ కూడా నమోదు కాక పోవడం తో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ( Dil Raju )ఈ సినిమా ను సమర్పించాడు.అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కూడా ప్రమోషన్ కోసం ముందుకు వచ్చింది.
ఆమె కష్టానికి ప్రతిఫలం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శాకుంతలం సినిమా ఫెయిల్యూర్ పట్ల సమంత సోషల్ మీడియా లో స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.
ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.అంత పెద్ద సినిమా యొక్క ఫెయిల్యూర్ ను మరీ ఇంత లైట్ తీసుకుంటావా అంటూ కొందరు సమంత పై టోల్ చేస్తున్నారు.
తాజాగా సినిమా లో మేనక పాత్ర లో కనిపించిన సీనియర్ హీరోయిన్ మధుబాల( Madhubala ) కూడా శాకుంతలం సినిమా యొక్క ఫలితం పై ఆవేదన వ్యక్తం చేశారు.చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకొని విడుదల అయ్యే వరకు చాలా కష్టపడ్డారు.
సినిమా విడుదలైన తర్వాత సంవత్సరం పాటు గ్రాఫిక్స్ కోసం కృషి చేశారు.ఇంత కష్టపడి చేసిన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని భావించాము.

కానీ ఇలా అవ్వడం దురదృష్టకరమంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించి మెప్పించారు, కానీ ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడం విడ్డూరం అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో.ఈ సినిమా ఎందుకు విఫలం అయ్యిందో అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.అయితే సినిమా ఫలితంపై మధుబాలకు ఉన్న ఆవేదన బాధ లో కనీసం సగం అయిన సమంతకు ఉన్నట్లుగా అనిపించడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.







