తెలుగు ప్రేక్షకులకు నటుడు డైరెక్టర్ ప్రియదర్శిని రామ్( Priydarshini Ram ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట డైరెక్టర్ గా వ్యవహరించి ఆ తర్వాత నటుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియదర్శిని రామ్.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియదర్శిని రామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కాగా ఇంటర్వ్యూలో భాగంగా బాలకృష్ణ( Balakrishna ) వ్యక్తిత్వం గురించి అడగగా ప్రియదర్శిని స్పందిస్తూ.వైఎస్ జగన్( YS Jagan ) కుటుంబంతోనే కాకుండా బాలకృష్ణతో కూడా ఆయన ఎంత సన్నిహితంగా ఉంటారో వెల్లడించారు.

బాలకృష్ణ తన జూనియర్ అని అయినా సరే బాలయ్యను అన్న అని పిలుస్తానని అన్నారు.బాలకృష్ణ పసి బిడ్డ లాంటి వారు, ఒకసారి ఎయిర్ పోర్ట్ లో లగేజ్ పట్టుకుని వెళ్తుంటే దూరం నుంచి గుర్తుపట్టి బాక్సీ అని పిలిచారని అన్నారు.బాక్సీ అంటే అప్పట్లో బాక్సింగ్ చేసేవాడినని అన్నారు.అందరూ కాలేజ్ లో ఉన్నప్పుడు బాక్సీ అని పిలిచేవారని చెప్పుకొచ్చారు ప్రియదర్శిని.ఎయిర్ పోర్ట్ లో తనను చూసి గుర్తుపట్టి బాక్సీ అని పిలిచారని అప్పుడు కూడా ఎవరో ఫోటో అడిగితే బాలకృష్ణ కోప్పడ్డారని. ఆయనకు ఫోటో దిగడం ఇష్టం ఉండదని ప్రియదర్శిని అన్నారు.

తల్లిదండ్రులతో ఫోటో తీసుకోవాలి గానీ సినిమా నటులతో ఫోటోలు ఏంటని బాలయ్య ఆలోచన అని అన్నారు.ఒకసారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పేద పూజారికి సర్జరీ జరిగితే డిస్కౌంట్ కావాలని ఆ పూజారి తనను అడిగారని, అయితే సహాయం చేసే శక్తి తనకు లేదని రాజకీయాల్లో లేను, మీడియాలో లేను, నా శక్తి సరిపోదని చెప్పి సాయం చేయమని బాలకృష్ణకు మెసేజ్ పెట్టానని అన్నారు.బసవతారకం హాస్పిటల్ లో పూజారికి సర్జరీ జరిగింది, డిస్కౌంట్ అడుగుతున్నాడు, సహాయం కావాలి అని మెసేజ్ పెడితే బాలకృష్ణ ఫోన్ చేశారని అన్నారు.ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, హాస్పిటలే నీది.
నన్ను అన్న అంటావేంటి, నీ కన్నా చిన్నోడిని నేను.నీ హాస్పిటల్ కదా, నువ్వు డిస్కౌంట్ అడుగుతావేంటి.
డిస్కౌంట్ ఇచ్చేసేయ్, నన్ను అడగాలా అంటూ సమాధానమిచ్చారని చెప్పుకొచ్చారు ప్రియదర్శిని.







