ఎగ్జిబిషన్ లో విరిగిపడిన స్వింగ్ రైడ్... వీడియో వైరల్..

ఆఫీసులకు సెలవులు ఉన్నప్పుడు మనలో చాలా మంది కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపడానికి తరచుగా విహారయాత్రలకు, ఎగ్జిబిషన్ లకు వెళ్తు ఉంటారు.ఎగ్జిబిషన్లో ఉన్న జాయింట్ వీల్, రౌండ్ స్వింగ్, హర్స్ రైడింగ్, చెయిర్ గేమ్ మొదలైన వాటిలో ఎక్కడానికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు ఆసక్తి చూపిస్తు ఉంటారు.

 Swing Ride Accident In Delhi Ghaziabad Ramleela Maidaan Exhibition Details, Swin-TeluguStop.com

ఎగ్జిబిషన్ కు వెళ్లగానే పెద్ద వాళ్లు కూడా పిల్లల్లాగా మారిపోయి ఎంజాయ్ చేస్తుంటారు.కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులలో అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి.ఇప్పటికే ఎగ్జిబిషన్ లో జాయింట్ వీల్ లు ఊడిపోయి కిందపడిపోవడం,లేదా ఏదైన ప్రమాదాలు జరిగిన ఘటనలు వార్తలలో చూస్తూనే ఉంటాం.ఈ కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది.

ఢిల్లీలోని ఘజియాబాద్ లోని రాంలీలా మైదాన్ లో షాకింగ్ ఘటన సంభవించింది.అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ లో కొందరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు.వారంతా స్వింగ్ రైడ్ ఎక్కికూర్చున్నారు.అక్కడున్న వారంతా అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంతలో స్వింగ్ ఐరన్ రాడ్ నుంచి ఊడిపోయింది.వెంటనే అది స్పీడ్ గా ఎగిరి బయటవైపుకు వచ్చి పడింది.

అక్కడే ఉన్న నలుగులు వ్యక్తుల గాయపడ్డారు.దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.వీరిలో ముగ్గురుపిల్లలు, ఒక మహిళ ఉన్నారు.వెంటనే వీరందరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

ఈ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి ప్రమాదకరమైన స్వింగ్ రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా కొంతమంది సలహాలు ఇస్తూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube