కృష్ణ పని అయిపోయిందనుకున్న సమయంలో చిరు, నాగ్ లకు షాకిచ్చిన కృష్ణ.. ఆ సినిమా సక్సెస్ తో?

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తే పాతవాళ్లకు అవకాశాలు తగ్గడం సాధారణంగా జరుగుతుంది.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలగగా తర్వాత రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సత్తా చాటారు.

 Shocking Facts About Krishna Number One Movie Details Here Goes Viral,superstar-TeluguStop.com

ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది.

అయితే ఒకానొక దశలో కృష్ణ( Superstar Krishna ) పని అయిపోయిందని కామెంట్లు వినిపించగా ఆ సమయంలో కృష్ణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు నంబర్ వన్ సినిమా( Number One Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సౌందర్య నటించి మెప్పించారు.

1994 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సినిమాలలో( Sankranthi Releases ) టాప్ గా నిలిచింది.నెంబర్ వన్ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు ముగ్గురు మొనగాళ్లు( Muggguru Monagallu ) రిలీజ్ కాగా వారం రోజుల తర్వాత గోవింద గోవింద( Govinda Govinda ) విడుదలైంది.అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యాయి.

నెంబర్ వన్ సినిమా మాత్రం అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది.

మహేశ్ ఆనంద్, కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో విలన్లుగా నటించారు.

బ్రహ్మానందం( Brahmanandam ) కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాలో కృష్ణ విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు.

కృష్ణ ఈ సినిమాలో యంగ్ గా కనిపించారు.ఈ సినిమా ఫలితాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకవ్వడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube