మన పౌరాణిక గ్రంథాల్లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలు మనం ఎలా పరిపూర్ణ మనిషిగా జీవించాలో తెలియజేస్తాయి.
వీటి నుంచి మనం జీవిత విలువలు ఎన్నో తెలుసుకోవచ్చు.వాటి నుంచి జీవిత సత్యం తెలుసుకోవచ్చు.
ఇతరులతో ఎలా ప్రవర్తించాలి.ఇతరులతో ఎలా మెలగాలి లాంటి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
అలాగే ఇతరులకు సహాయం చేయడం, అందరితో కలిసిమెలిసి ఉండటం లాంటి విషయాలను వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు.

అయితే రామాయణం, మహాభారతం లాంటి పురుణాల్లో తండ్రి మాటని జవదాటని, తండ్రికి అత్యంత గౌరవం ఇచ్చిన ఎంతోమంది వీరులను మనం చూడవచ్చు.ప్రాణం పోయినా సరే తండ్రి మాటలకు కట్టుబడి, వాళ్లు చెప్పినట్లు చేసేవారు ఎంతోమంది ఉన్నారు.తండ్రి మాటలకు ఎంత విలువ ఇచ్చారో వీటిని చదివితే మనకు తెలుస్తుంది.
పురాణాలలో ఈ వీరుల నుంచి మనం ఎంతో నేర్చుకుంటున్నామంటే.తల్లిదండ్రుల పట్ల వాళ్లు చూపించిన గౌరవమే అని చెప్పవచ్చు.

తండ్రి మాట జవదాటని వారిని, తండ్రి ప్రేమను గెలిపించేందుకు పదవిని త్యాగం చేసిన వారిని, తండ్రి చెప్పాడని తల్లిని సంహరించి తిరిగి బతికించిన కుమారుల గురించి మనం పురాణాల్లో తెలుసుకోవచ్చు.దశరథుడు చెప్పాడని అరణ్యవాసం చేసిన రామచంద్రుడి( Lord rama ) గురించి మనం విన్నాం.ఒక మాట కూడా మాట్లాడకుండా తండ్రి చెప్పాడని అడవులకు బయలుదేరారు.ఇక శంతనుడు-బీష్ముడు, జమదగ్ని-పరశురాముడు( Jamadagni ), శ్రవణకుమారుడు లాంటి వారు తల్లిదండ్రుల కోసం ఎంతో చేశారు.
శ్రవణకుమారుడు చనిపోయే సమయంలో కూడా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని దశరథుడికి చెబుతాడు.ఇక శంతనుడు అంగీకరించపోయినా భీష్ముడు ( Bhishma )రాజ్యాన్ని త్యాగం చేస్తాడు.తండ్రి సంతోషం కోసమే భీస్ముడు రాజ్యాన్ని ఇచ్చేస్తాడు.ఇలా ఎన్నో కథలు మనం చెప్పుకోవచ్చు.
DEVOTIONAL