బహుజన కార్మికుల హక్కుల సాధనకోసం ఐక్య పోరాటాలు: కార్యదర్శి మట్టే గురుమూర్తి

బహుజన కార్మికుల హక్కుల సాధన కొరకు నిరంతరం పోరాటం చేస్తూ, సమస్త రంగాల్లో ఉన్నటువంటి కార్మికులను ఐక్యం చేయడమే లక్ష్యంగా బహుజన కార్మిక విభాగం పనిచేస్తుందని బహుజన కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మట్టే గురుమూర్తి( Matte Gurumurthy ) అన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మట్టే గురుమూర్తి మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన రాజ్యాధికార ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( Dr.

 United Struggles For Realization Of Bahujan Workers' Rights: Secretary Matte Gur-TeluguStop.com

RS Praveen Kumar ) నాయకత్వంలో బహుజన కార్మికుల హక్కుల కొరకు సమస్త రంగాల్లో పోరాటం చేస్తామన్నారు.బహుజన కార్మికులను సమాయత్వం చేయుటకు బహుజన కార్మిక విభాగం ఇకనుండి ముందు వరుసలో ఉంటుందన్నారు.

మున్సిపాలిటీ, విద్యా, వైద్య, పంచాయతీ రంగాలలోని కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు.గత పదేళ్లుగా ఏం చేయని ప్రభుత్వం, 21రోజుల్లో దశాబ్ది ఉత్సవాల పేరుతో ఏం చేస్తారని విమర్శించారు.

కార్మిక హక్కుల సాధన కొరకు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన సమస్త హక్కుల సాధనకు ఉద్యమాన్ని దశలవారీగా ఉదృతం చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ‘బహుజన కార్మిక విభాగం’ ఖమ్మం జిల్లా కమిటీని ప్రకటించారు.

అధ్యక్షులుగా ఊటుకూరి నాగేశ్వరావు, ప్రధాన కార్యదర్శిగా పుచ్చకాయల రవి యాదవ్, ప్రచార కార్యదర్శిగా పల్లెపొంగు మాధవరావు, ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులుగా నారపోగు నాగేశ్వరావు, ప్రచార కార్యదర్శిగా మసి నాగరాజు, అదేవిధంగా ఖమ్మం అసెంబ్లీ అధ్యక్షుడిగా నల్లగట్ల సతీష్, పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడిగా నల్లగట్టు మధు, మధిర అసెంబ్లీ అధ్యక్షుడిగా గద్దల శ్రీనివాస్ ను ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube