పేదల రవాణా సౌకర్యం అయిన ఆర్టీసి సంస్థను కాపాడుకుని, ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రాంగణం (బస్ స్టేషన్) ను ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఉన్న బస్సులను కాపాడుకుంటూ పేద వాడి ప్రజా రవాణాను మరింత మెరుగు పర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.సమ్మె సమయంలో రోజుకు దాదాపు 13కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితుల నుండి రోజుకు 1.50 కోట్లకు పడిపోయినప్పటికీ ఉద్యోగులు, సంస్ధను కాపాడుకున్నామని వివరించారు.ఇది మరువకముందే కావిడ్ మహమ్మారి వచ్చి పడింది.
దానిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, దాదాపు రెండు సంవత్సరాలు సంస్ధ గడ్డుకాలం అనుభవించామని పేర్కొన్నారు.ఇలాంటి అనేక విపత్కర పరిస్థితుల నుండి అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ గారు కాపాడుతున్నారని, 6నెలలు మాత్రం బస్సులు పూర్తిగా డిపోకే పరిమితం కావడం సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
ఇంతటి కష్టాల్లో ఉన్నా కూడా కేసీఅర్ గారు ఎక్కడ వెనకడుగు వేయలేదని, పైగా సంస్థను, ఉద్యోగులను ప్రోత్సహించి నిధులు వెచ్చించి ప్రజా రవాణా ను కాపాడుతున్నారన్నారు.సంస్ధ సంరక్షణకు బడ్జెట్ లో 15వందల కోట్లు కేటాయించి 49వేల మంది ఉద్యోగులను, సంస్థను కాపాడుతున్నారని వివరించారు.
అనేక విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటు కూడా కూడా ఉద్యోగులకు 44%శాతం ఫిట్మెంట్, ఐ.ఆర్ ఇచ్చి కాపాడుకున్నామన్నారు.డీజిల్ రెట్లు విపరీతంగా పెరిగిపోయిందని, ఒక్క రోజుకు దాదాపు 6లక్షల లీటర్ల ప్రస్తుతం వినియోగిస్తూన్నామని అన్నారు.ప్రతి లీటర్ అదనం రూ.40 పెట్టి కొంటున్నామన్నారు.పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం రవాణా సంస్థను నాలుగు విభాగాలుగా విడదీసి ప్రైవేట్ పరం చేసే యోచనలో ఉందన్నారు.
మిగతా రాష్ట్రాల్లో ప్రజా రవాణా నిర్వహణ నుండి ప్రభుత్వం తప్పుకునే ఆలోచనలో ఉందని, దీనితో పాటు పలు రాష్ట్రాలు ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తుంటే తెలంగాణ ఆర్టీసి సంస్థ మాత్రం ప్రజల కోసం, ప్రజల రవాణా ను మెరుగు పర్చి వారికి సేవలు అందించాలనే దృక్పథంతో ఇంతటి భారాన్ని మొస్తున్నామని వివరించారు.ఉన్న బస్సులను కాపాడుకుంటూ మరిన్ని బుస్ లను కొనుగోలు చేయలని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆర్టీసి ప్రజల అస్థి అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, స్థానిక ఎమ్మెల్యే ల నిధులు కేటాయించాలని కోరామని, ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగిందని, అందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారు స్పందించి తన CDP నిధుల నుండి రూ.10 లక్షలు కేటాయించడం హర్షణీయం అన్నారు.దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, మన సమస్యలను సాధ్యమైనంత మేర పరిష్కరించకుంటే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఇవ్వగలమన్నారు.ప్రస్తుతం ప్రయాణికుల కంటే మాకు ఉచిత సర్వీలులైన బడి పిల్లలు, సీనియర్ సిటిజన్స్, సీజన్ టికెట్స్, జర్నలిస్ట్, రైతులు ఇలా వివిధ రకాల ఉచిత సేవలు ప్రయాణికులు ఉన్నారని అన్నారు.
ఆర్టీసీని ఆదరించాలని, సాధ్యమైనంత వరకు ఆర్టీసి బస్ లోనే ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల కోసమే ఆర్టీసి ఉందని గమనించాలని, ఇది ప్రజల అస్తి అని పేర్కొన్నారు.
అనంతరం బస్ స్టాండ్ నిర్మాణ పనుల్లో ముందుకొచ్చిన దాతలను శాలువాతో సత్కరించారు.