నిద్రపోతున్నప్పుడు కలలో దేవాలయం కానీ దేవాలయంలోని గంటలు కానీ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!

ముఖ్యంగా చెప్పాలంటే నిద్రలో కలలు కనడం ఒక సాధారణమైన విషయమే.కలలలో కనిపించే విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 Do You Know What Happens If You See A Temple But Not The Bells Of The Temple Whi-TeluguStop.com

ఎందుకంటే సైన్స్ ప్రకారం ఈ కలలు భవిష్యత్తు గురించి సమాచారాన్ని ఇస్తాయని కూడా చెప్పవచ్చు.అందుకే పూర్వం రోజులలో మహారాజు స్వప్న పండితులను తన ఆస్థానంలో ఉంచుకునేవాడు.

దీని ద్వారా రాజులు వారి కలలకు అర్ధాన్ని తెలుసుకునేవారు.కొన్ని కలలలో తరుచుగా మీరు గుడి లేదా గుడిగంటలు( temple or bells ) మోగడం చూసి ఉండవచ్చు.

Telugu Bells Temple, Science Dreams, Temple, Vastu, Vastu Tips-Latest News - Tel

దేవాలయం మన ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలకు కేంద్రమని కచ్చితంగా చెప్పవచ్చు.అటువంటి పరిస్థితులలో కలలో గుడి లేదా గుడి గంటలు మోగడం అంటే దేనికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం.కలలో మీకు దేవాలయం కనిపిస్తే అది శుభ సూచనగా పరిగణించబడుతుంది.ఇలా కనిపిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనులు త్వరగా పూర్తవుతుంది అని అర్థం చేసుకోవచ్చు.

మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీకు కలలో దేవాలయం కనిపిస్తే ఈ రోజు దేవాలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి దానం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.

Telugu Bells Temple, Science Dreams, Temple, Vastu, Vastu Tips-Latest News - Tel

అలాగే మీ కలలో పురాతన దేవాలయాలు( Ancient temples ) కనిపిస్తే భయపడాల్సిన పనిలేదనీ పండితులు చెబుతున్నారు.అలాంటి కలలు మీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంది అని సూచిస్తాయి.అలాగే మీ స్నేహితుడి వల్ల మీరు అదృష్టవంతులు అవుతారు.

స్వప్న శాస్త్రం(science of dreams ) ప్రకారం మీరు దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు కలలో కనిపిస్తే శుభ సూచకంగా భావించవచ్చు.ఇలా కల వస్తే దేవుని దయతో మీకు ఏదైనా మంచి జరుగుతుంది.

కలలో గంటను మోగించడం లేదా గంటను చూడడం లేదా గంట శబ్దం వినడం కూడా శుభసంకేతంగా భావించవచ్చు.ఈ కల విజయానికి సూచిక అని చెప్పవచ్చు.అలాగే త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube