యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో తారక్ ఎలాంటి కథతో మనముందుకు వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం కూడా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో తారక్ సరసన చాలా మంది పేర్లు వినిపించినా తాజాగా శృతి హాసన్ పేరు దాదాపు కన్ఫం అయినట్లు తెలుస్తోంది.గతంలోనూ శృతితో తారక్ నటించిన సంగతి తెలిసిందే.
అయితే మొదట్నుండీ ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుండగా, ఇప్పుడు ఆమె కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగానే త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఈ క్రమంలో శృతి హాసన్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుందట.







