రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా గత ఏడాది మార్చి నెలలో విడుదలయ్యి సంచలనాలను సృష్టించింది.
పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకోగా తాజాగా మరొక అద్భుతమైన అవార్డును సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇలా ఈ సినిమాలోని ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి అందజేశారు.ఒక తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఓ గొప్ప అవార్డును సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై స్పందిస్తూ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగన్ అలియా భట్ వంటి వారు సైతం స్పందించారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించిన ఒలీవియా మోరీస్ మాత్రం ఇప్పటివరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు పై స్పందించలేదు.అయితే ఈ సినిమాలో ఈమె ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించారు.

అదేవిధంగా నాటు నాటు పాటలో ఈమె ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేశారు.నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నటి అలియా భట్ కన్నా ఒలీవియా స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది అదే విధంగా నాటు నాటు పాటలో కూడా ఈమె డాన్స్ వేసినప్పటికీ ఈ పాటకు గాను వచ్చిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై స్పందించకపోవడం ఏంటని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.







