బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ప్రస్తుతం బుల్లితెరపై ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా యాంకర్ విష్ణు ప్రియ చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.
ఇలా ఈమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తరచూ డాన్స్ వీడియోలను చేస్తూ ఆ వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.

అయితే తాజాగా విష్ణు ప్రియ తన స్నేహితురాలితో కలిసి హాలిడే వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతూ చౌదరితో కలిసి ఈమె ఇండోనేషియా వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అక్కడ సముద్ర తీరాన స్విమ్ సూట్ ధరించి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.
ఈ క్రమంలోనే విష్ణు ప్రియ ఈ వెకేషన్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ జీవితం చాలా చిన్నది ఉన్నప్పుడే అనుభవించాలి అంటూ ఒక పాటను జత చేశారు.

ఇలా సముద్ర తీరాన తడిసిన అందాలతో ఉన్నటువంటి వీరి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది నేటిజన్లో మీ లైఫ్ చాలా బాగుంది.ఫుల్ ఎంజాయ్ చేయండి ఆటో కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి వీరి వెకేషన్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక గత కొద్దిరోజుల క్రితం విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాకింగ్ గురవడంతో ఈమె ఫేస్ బుక్ పేజ్ నుంచి అడల్ట్ ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో ఒకసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే విష్ణు ప్రియ తన అకౌంట్ హ్యాక్ అయిందని అందరూ తననీ అన్ ఫాలో చేయమంటూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సూచించిన సంగతి తెలిసిందే.







