ప్లీజ్ మేడం మీరు మళ్లీ హీరోయిన్‌ గా, ఐటెం సాంగ్స్ చేయండి

హీరోయిన్ గా ఛార్మీ కౌర్ చిన్న వయసులోనే టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది.ఇరవై ఏళ్లు కూడా రాకుండానే చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది.

 Fans Want Charmme Kaur Do Movies Again ,  Charmme Kaur ,  Film News ,  Hdb Charm-TeluguStop.com

దాదాపుగా దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా నటించి ఎంతో మంది సీనియర్ మరియు జూనియర్‌ స్టార్‌ హీరోలతో నటించిన విషయం తెల్సిందే.ఛార్మీ ఇప్పటికి కూడా నటిస్తే వరుసగా ఆఫర్లు క్యూ కడుతాయి.

ఆమె చేయాలనుకుంటే ఏడాదికి అయిదు ఆరు ఐటెం సాంగ్స్ వస్తాయి.ఆమె పారితోషికం కూడా భారీగా ఉంటుంది.

ఆమెకు హీరోయిన్ రేంజ్ లో పారితోషికాలు ఇస్తామనే వారు కూడా చాలా మంది ఉన్నారు.కాని ఛార్మీ మాత్రం ఇప్పటికి ఎందుకో సినిమాల్లో నటించే విషయమై ఆసక్తి చూపడం లేదు.

ప్రస్తుతం సినిమా పరిశ్రమలోనే కొనసాగుతున్నా కూడా ఆమె మాత్రం రెగ్యులర్ గా సినిమాలను చేయడం లేదు.ఆమె సినిమాలను చేయక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పూరి జగన్నాద్‌ తెరకెక్కిస్తున్న ప్రతి ఒక్క సినిమా నిర్మాణ వ్యవహరాలు ఆమె చూసుకుంటుంది.సినిమా ల నిర్మాణం మొదలుకుని ప్రతి విషయంలో కూడా ఆమె పూరికి ఒక స్నేహితురాలిగా కంటిన్యూ అవుతుంది.

లైగర్ సినిమా లో ఆమె భాగస్వామ్యం ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే.అంతటి పేరు దక్కించుకున్న ఛార్మీ అప్పుడప్పుడు తన రీసెంట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

ఆ ఫోటోలను చూస్తూ ఉంటే ఛార్మీ మళ్లీ హీరోయిన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.నేడు ఆమె బర్త్‌ డే.ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే చాలా మంది ప్లీజ్ మేడం దయచేసి మళ్లీ సినిమాల్లో నటించండి. ఐటెం సాంగ్స్ చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి ఛార్మి నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube