'హరి హర వీరమల్లు' ని పట్టించుకోని డైరెక్టర్ క్రిష్..పవన్ కళ్యాణ్ తో గొడవలు నిజమే!

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పిలవబడే చిత్రం ‘హరి హర వీరమల్లు’.( Hari Hara Veeramallu ) ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి జానర్ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు టచ్ చెయ్యలేదు.

 Pawan Kalyan Director Krish Hari Hara Veeramallu Movie Shooting Update Details,-TeluguStop.com

హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమా ని సుమారుగా 250 కోట్ల రూపాయిల ఖర్చు తో ప్రముఖ నిర్మాత ఏ ఏం రత్నం( AM Rathnam ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.

మరో 50 రోజులకు పైగా షూటింగ్ బ్యాలన్స్ ఉంది.పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఆ షూటింగ్ పూర్తి అయిపోతుంది.

కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ని తిరిగి ప్రారంభించాడు.సుమారుగా 50 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మధ్యలో మళ్ళీ ఆగింది.

Telugu Krish, Harihara, Og, Pawan Kalyan, Rathnam-Movie

ఆ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) చిత్రానికి 23 రోజుల డేట్స్ కేటాయించి ఆ చిత్రాన్ని పూర్తి చేసాడు, ఆ తర్వాత ‘ఓజీ’( OG Movie ) మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ( Ustad Bhagat Singh ) చిత్రాలకు డేట్స్ ఇచ్చాడు.కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి మాత్రం డేట్స్ కేటాయించలేదు.ఏ ఏం రత్నం మరియు డైరెక్టర్ క్రిష్ ఈ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చాలా కాలం నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు.కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడు.

కానీ నిర్మాత రత్నం మాత్రం ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో కూడా తెలిపాడు.మరి పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అనేది ఇప్పుడు అభిమానుల్లో రేగిన ఉత్కంఠ.

Telugu Krish, Harihara, Og, Pawan Kalyan, Rathnam-Movie

అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాపై ఇంత ఆలస్యం చెయ్యడం వల్ల డైరెక్టర్ క్రిష్( Director Krish ) చాలా అసంతృప్తి తో ఉన్నట్టుగా తెలుస్తుంది.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేసారు.గుబురు గెడ్డం తో ఎర్రని వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ సింహం లాగా ఉన్నాడు.ఈ పోస్టర్ ప్రొడక్షన్ హ్యాండిల్ నుండి అప్లోడ్ అయ్యింది కానీ, డైరెక్టర్ క్రిష్ నుండి మాత్రం నో రెస్పాన్స్.

కేవలం ఒక ఒక రీ పోస్ట్ కొట్టి సైలెంట్ అయ్యాడు.దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఈ ప్రాజెక్ట్ పై ఎంత అసహనం తో ఉన్నాడు అని.క్రిష్ ఇలా ప్రవర్తించడం తో అభిమానులు కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అనే అనుకుంటున్నారు, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube