మీ బలమైన కోరికలు నెరవేరాలంటే.. ఏప్రిల్ 6న పంచముఖి హనుమంతుడిని పూజించండి..!

మన దేశంలో ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని( Hanuman Jayanti ) ఏప్రిల్ ఆరవ తేదీన జరుపుకుంటున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖి హనుమంతుడిని( Panchmukhi Hanuman ) ఆరాధించడం వల్ల మీ ఈ ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.

 To Fulfill Your Strongest Desires Worship Panchmukhi Hanuman On 6th April , Hanu-TeluguStop.com

ఎందుకంటే హనుమంతుని ప్రతి మొహానికి దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.పంచముఖి హనుమంతుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.

ఇంకా చెప్పాలంటే జీవితంలో కష్టాలు దూరమైపోతాయి.

కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు ఆంజనేయుడు ఆశీర్వాదాలతో పొందుతారు.భయం నిరాశ ఒత్తిడి లాంటి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.

మీ మనసులోని మంచి కోరికలన్నీ నెరవేరుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే హనుమాన్ పంచముఖి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది.

ఇందులో మొదటి ముఖం వానారం.ఇది తూర్పు దిశలో ఉంటుంది.

రెండవ ముఖం పశ్చిమ దిశలో ఉన్న గురుడిది.మూడో ముఖం వరహాది.

ఇది ఉత్తర దిశలో ఉంటుంది.

Telugu Bhakti, Devotional, Hanuman, Hanuman Jayanti, Rama Lakshmana-Latest News

నాల్గవ ముఖం నరసింహునిది.అతను దక్షిణ దిశలో ఉంటాడు.ఐదవ మొహం ఆకాశం వైపు ఉన్న గుర్రం.

హనుమంతుడు పంచముఖి అవతారం ఎందుకు ఎత్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.లంక యుద్ధం సమయంలో రావణుడి సోదరుడు అహీరావణుడు తన భ్రమతో రాముడు, లక్ష్మణులను ఆశ్చర్యపరిచాడు.

వాళ్ళిద్దరినీ బలివ్వడానికి పాతాళానికి వెళ్ళాడు.అక్కడ ఐదు దీపాలు వెలిగించాడు.

వీటిని ఐదు దిక్కుల్లో ఉంచుతాడు.హనుమాన్ పాతాళ లోకానికి చేరుకున్నప్పుడు ఈ పరిస్థితిని చూసి ఆ భ్రమను అర్థం చేసుకున్నాడు.

Telugu Bhakti, Devotional, Hanuman, Hanuman Jayanti, Rama Lakshmana-Latest News

ఈ ఐదు దీపాలను ఒకే సమయంలో ఆర్పీ వేస్తేనే అహీరావణ సంహారం జరుగుతుంది.అప్పుడే పంచముఖి అవతారం ఎత్తి హనుమంతుడు ఏకకాలంలో ఆ దీపాలను ఆర్పి వేసి అహిరావణుడిని చంపిన తర్వాత రామలక్ష్మణులను సురక్షితంగా తీసుకెళ్లాడు.అందుకే ఈ పంచముఖి హనుమంతుని పూజించడం వల్ల మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube