కీసరగుట్టలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశామని మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారు.కీసరగుట్టలో జరిగే శివరాత్రి మహోత్సవాలకును పురస్కరించుకొని చేసుకున్నా పనులను ఆయన గురువారం పరిశీలించారు.
ఆయనతో పాటు అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, నరసింహారెడ్డి కూడా ఉన్నారు.ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.
మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధుల సహకారంతో కీసర గుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంత గా జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు.ఈసారి లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు.
పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు.
కీసర నుంచి క్షేత్రం వరకు వాహనాల రాకపోకలు ఆగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరాతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని వెల్లడించారు.భక్తులు స్వామివారిని దర్శించుకునే సమయంలో క్యూ లైన్ లో తాగునీటి ప్యాకెట్లు సరఫరా చేస్తామని, ఉపవాస దీక్ష చేపట్టే భక్తులకు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాల పంపిణీ కూడా చేస్తామని తెలిపారు.
వీఐపీలు వచ్చిన సమయంలో వారికి ఇబ్బందులు రాకుండా అదే సమయంలో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.మహిళల భద్రత నివారణకు మాఫ్తి లో పోలీసులు ఉంటారని తెలిపారు.
మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, షెడ్లు జాతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అమోయ్ కుమార్ వెల్లడించారు.భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.క్రీడాకారులకు, సిబ్బందికి, పరిశుద్ధ కార్మికులకు జాతరలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి ఆరు రోజులపాటు మెరుగైన వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
DEVOTIONAL