సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అమ్మవారి దర్శనం.. ఎక్కడంటే..

మన దేశంలోనీ ప్రజలు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి పండుగలను చేసుకుంటూ ఉంటారు.పండుగలే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు.

 Vishakapatnam Sri Kanakamahalakshmi Ammavaru Temple Details, Vishakapatnam, Sri-TeluguStop.com

అలా దర్శనం చేసుకోవడానికి వెళ్లాలంటే కొన్ని ఆలయాలలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు.కొన్ని దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రవేశ సమయాలు ఉంటాయి.

అలాంటి దేవాలయం విశాఖపట్నంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో విజయదశమి సందర్భంగా మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుంది.ఆరోజు తెల్లవారు జామున నుండి విశాఖ ప్రజలే కాకుండా చాలా జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.

ఆరోజు స్వర్ణ అలంకరణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.ఇలా దర్శించుకోవడమే కాకుండా నేరుగా గర్భగుడిలోకి వెళ్లి పూజలు కూడా చేస్తారు.విజయదశమి సందర్భంగా అమ్మవారికి బంగారు ఆభరణాలతో అలంకరించి, బంగారు పువ్వులతో ఎంతో భక్తితో పూజలు చేస్తారు.సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకునే అవకాశం కలగడం వల్ల ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

విశాఖలో కొలువైన ఈ శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది.ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఏమి ఉండదు.

Telugu Bhakthi, Darshanam, Devotional, Darshan, Vijayadashami, Vishakapatnam-Lat

ఈ ఆలయానికి చాలా వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది.ఈ చరిత్ర ఏమిటంటే, విశాఖపట్నంలో ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ అమ్మవారి ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి ఆ రాజు అమ్మవారిని రక్షించారని పెద్దలు చెబుతారు.ఇక్కడ బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి తమ ఆలయం ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్టించాలని కోరడం వల్లే ఈ ఆలయానికి పైకప్పు లేకుండా నిర్మించారాని పెద్దవారు చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube