ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయి ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ కలిసి సమావేశాలు పెట్టుకుని మరీ సినిమా నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా తగ్గించాలి అని చర్చలు కూడా జరిపారట.
వాటిలో ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ముంబై నుంచి అలాగే ఇతర భాషల నుండి వచ్చిన నటులతో ఎక్కువ సమస్యలు వ్యయాలు ఉన్నాయని నిర్మాతలు గ్రహించారట.ఇక అందులో భాగంగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా మురళీ శర్మతో కూడా రెండుసార్లు నిర్మాతల కమిటీ మాట్లాడారట.
మురళీ శర్మ సినిమాలో నటించినందుకు గాను రోజుకు నాలుగు రక్షల రూపాయలు తీసుకుంటారట.అతని స్టాఫ్ కోసం మరొక 50,000 ఎక్స్ట్రాగా తీసుకుంటారట.అంతే కాకుండా అతని కోసం నాలుగు కార్లు ఏర్పాటు చేయగా అందులో ఒక దానిలో మురళి శర్మ ప్రయాణిస్తే మిగిలిన మూడు కార్ల లో కూడా ఆయన స్టాఫ్ ప్రయాణిస్తారట.ఇవన్నీ ఒక ఎత్తు అయితే మురళి శర్మ ట్రావెల్ చేసినప్పుడు విమానంలో రెండు పక్కల రెండు సీట్స్ ఖాళీగా వదలాలట.
అలాగే ఆ రెండు సీట్లు కూడా నిర్మాతనే కొనేసి వాటిని ఖాళీగా పెట్టాలట.అలాగే మురళి శర్మ బసచేయడం కోసం పార్క్ హయాత్ హోటల్ లోనే రూమ్ తీసుకోవాలట.
ఇవన్నీ కూడా మురళీ శర్మకు నిర్మాతనే ఖర్చు చేయాలట.అలాగే ఆయన ఎటువంటి ఆహారం తింటాడు అన్న విషయం కూడా నిర్మాతనే చూసుకోవాలట.అందువల్లే నిర్మాతలకు మురళీ శర్మ జీతం అతని మీద పెడుతున్న ఖర్చు విషయంలో కొంత ఆందోళన కలిగి రెండు సార్లు అతనితో మాట్లాడారట.కేవలం మురళీ శర్మతో మాత్రమే కాకుండా తెలుగు రాని నటీనటులు అంటే ముంబై నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లతో ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయని, అయానటీనటుల మేనేజర్లను పిలిచి వారితో కూడా నిర్మాతలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
షూటింగ్ నుంచి సాయంత్రం 6 అవ్వగానే వెళ్లిపోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటారట.అంతేకాకుండా ఇంకొక అరగంటలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని దర్శకుడు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారట.