శ్రీ కృష్ణుడు బాలుడుగా వ్రేపల్లెలో పెరిగే రోజులలో ఒకనాడు మన్ను తిన్నాడు.బల రాముడు వెళ్లి యశోదకు చెప్పగా… ఆమె మన్ను ఎందుకు తిన్నావు? అని కృష్ణుణ్ణి గద్దిస్తుంది.కృష్ణుడు తాను మన్నుతిన లేదంటాడు.తనమాట ఋజువు చేయడానికి నోరు తెరచి, చూపుతాడు.అప్పుడు యశోదకు అతని నోట బ్రహ్మాండమంతా కనిపిస్తుంది.ఇదొక విశ్వరూప ప్రదర్శన.
శ్రీ కృష్ణుడు పెరిగి పెద్ద వాడు అయ్యాక కౌరవ పాండవుల మధ్య పొందు కుదర్చడానికి రాయబారిగా హస్తినా నగరానికి పోతాడు.అతని హితోపదేశం కౌరవుల చెవి కెక్కదు.
పైగా వారు కృష్ణుణ్ణి బంధించడానికి కుట్ర పన్నుతారు.అది గ్రహించి కృష్ణుడు అక్కడ తన విశ్వరూపం చూపుతాడు.
నారదాది మునులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు వీరికి భగవంతుడు విశ్వరూప దర్శనం అనుగ్రహిస్తారు.ధృతరాష్ట్రుని ప్రార్థన మేరకు అతనికి గూడా ఆ భాగ్యం కల్గిస్తాడు.
ఇది రెండవ విశ్వరూపం.ఆపై భారత యుద్ధ ప్రారంభ దినాన అర్జునుడు శోకమోహ గ్రస్తుడై యుద్ధం చేయను అంటాడు.
భగవంతునికి ఆత్మతత్త్వం బోధిస్తూ… గీతోపదేశం చేస్తాడు.
భారత యుద్ధం పూర్తి అయిన తరువాత శ్రీ కృష్ణుడు తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణం మవుతాడు.
దారిలో ఉదంకముని ఆశ్రమానికి పోతాడు.ఉదంకుడు ఉచిత రీతిని ఆయనను సత్కరించి యుద్ధనిర్వహణలో కృష్ణుడు నిర్వహించిన పాత్రనునిందాగర్భంగా పేర్కొంటాడు.
అప్పుడు కృష్ణుడు యుద్ధం అనివార్యమైన పరిస్థితుల్లో జరిగిందంటాడు.అందుకు ఆ ముని సమర్థుడవై ఉండి కూడా నీవు యుద్ధం నివారించలేకపోయావు.
ఈ పాపానికి ఫలంగా నీకు శాపమిస్తా నంటాడు.శాపంతో నీ తపస్సును వద్దంటూ కృష్ణుడు తన సకలదేవతా చెబుతాడు.
వివరించి అప్పుడు ఉదంకుడు “నేను నీ దయకు అర్హుడనైతే నాకు నీ విశ్వరూపం చూపు అని ప్రార్థిస్తాడు.అంతట కృష్ణుడతనికి తన విశ్వరూపం చూపుతాడు.
ఉదంకుడు ధన్యుడై నమః పురుషోత్తమాయతే అని నమస్కరిస్తాడు.భగవం రిన వరం ప్రసాదిస్తాడు.
కోరిన వరం ఇది నాల్గవ విశ్వరూప ప్రదర్శన.దేవకీపుత్రుడై కారాగారంలో పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులకు తన మహా విష్ణు స్వరూపం ప్రదర్శిస్తాడు.
మరొకసారి బ్రహ్మ కృష్ణుడు గోకులంలో పెరిగే సమయంలో లేగలను, గోపబాలురను గుహలో దాచేస్తాడు.కృష్ణుడది గ్రహించి తానే లేగలుగా, గోపబాలురుగా రూపధారచేసి పరిమిత స్థాయిలో విశ్వరూపం చూపించి బ్రహ్మకు గుణపాఠం నేర్పుతాడు.
మరొకసారి కంసుని ఆహ్వానం మేరకు అక్రూరునితో మధురానగరికి పోతూ యమునానదిలో స్నానం చేస్తున్న అక్రూరునికి కూడా ఆ నది నీట తన విశిష్ట రూపాన్ని చూపుతాడు.ఇలా పరిమిత స్థాయిలోనూ, అపరిమిత స్థాయి లోనూ పలుపర్యాయాలు కృష్ణుడు విశ్వరూపం చూపినట్లు భారత భాగవతాది గ్రంథాలు తెలుపుతున్నాయి.