ప్రస్తుత కాలంలో చాలా మంది తమకు వీలున్నప్పుడు మాత్రమే స్నానం చేస్తున్నారు.ప్రతి రోజూ స్నానం చేస్తున్నప్పటికీ.
ఉదయమే ఆఫీసులకు వెళ్లే వాళ్లు సాయంత్రం వచ్చాకా… కొందరైతే రెండు పూటలా స్నానాలు చేస్తుంటారు.అలాగే ముఖ్యమైన వారాలు అంటే దేవుడికి పూజ చేసుకునే రోజుల్లో కూడా వీలున్నప్పుడే తల స్నానం చేస్తుంటారు.
కనీ అలా కాకుండా ఉదయమే లేచి తలస్నానం చేస్తే మంచిదని వేద పండితులు చెబుతున్నారు.అయితే ఏయే వారం తల స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం చాలా మందికి వీలుంటుంది.అయితే బడి పిల్లల నుంచి ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా ఈ రోజు సెలవు ఉంటుంది.అయితే అందుకే ఆ రోజు తలస్నానం చేసి తాపాన్ని పోగొట్టుకోండి.సోమ వారం తలస్నానం చేయడం వల్ల అందం పెరుగుతుందట.
మంగళ వారం రోజు తలంటు పోసుకోవడం అమంగళం అని పెద్దలు వివరిస్తున్నారు.బుధ వారం చేస్తే వ్యాపార, వ్యవహార అభివృద్ధి జరుగుతుందట.
గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల ధన నాశనం జరుగుతుందట.శుక్రవారం రోజు తలంటు పోసుకోవడం వల్ల అనుకోని ఆపదలు వస్తాయట.
శనివారం తలన్నానం చేయడం వల్ల మహా భోగాలు కలిసి వస్తాయట.అయితే ఈ స్నానాలు విధి పురుషులకు మాత్రమే పరిమితం అని కూడా పలువురు చెబుతున్నారు.
అయినప్పటికీ.సామాన్య ప్రజలకు కూడా ఈ ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు.